Tuesday, 27 March 2018

428. Nakemi Koduva Nadhudunda Ika Srikarundagu Devude

నాకేమి కొదువ - నాథుడుండ ఇక
శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠపాలకుడు
నా యేక రక్షకుడ

ఎన్నికైన - ఎండనట్టి = సన్న పచ్చిక
విం తరుగని - సదుపాయంబుల్ -
నా - కెన్నో చేయున్ గనుక

తనివి తీరన్ మే - ళ్ళనుభవింప =
నను సదా మేళ్ళనెడి పచ్చిక -
నదిమి మృదువుగ - పండు - కొన జేయును గనుక

ఎంత శోధన - యెండయున్న =
ఎంతకు న్నోరిగర దెపుడు - శాంత
జలములు - నా - చెంతనే యుండున్ గనుక

తప్పిపోయిన నన్ - దారింబెట్టి -
తెప్పరిల్ల చేసి నాకు - తీర్చు నలసటను -
నా - తప్పు మన్నించున్ గనుక

నీతి మార్గమునన్- నిల్పును నన్ను =
నీతి లేని నాకు తన సు - నీతి దయచేయున్ -
స్వ - నీతిన్ ద్రుంచున్ గనుక

చావు చీకట్ల - శక్తియుండు =
లోయలో బడి పోవలసినను-నే వెరువకుండ -
నా - దేవుడే తోడు గనుక

కష్టంబులను చీ - కటి లోయలో =
స్పష్టముగ ఘన సౌఖ్యమును నా - దృష్టికింజూపి -
నా - నష్టముల్ దీర్చున్ గనుక

మీద పడునట్టి - శోధనలన్ =
నా దరికి రానీక దండము - నన్ను
లాగుచును - నా - కాదరణయౌను గనుక

పగవారల్ సిగ్గు - పడునట్లుగ =
జగతి యెరుగని సౌఖ్యభోజన - మగు పరచుచున్ -
హా - తగినదే పెట్టున్ గనుక

తన యాత్మానంద - తైలంబుతో =
అనుదినము తలయిం విసుగు - కొనక
తుడుచును - నా - కను నీళ్ళన్నీ గనుక

పలు విధములైన - భాగ్యములతో =
వెలుపలికి దిగ వెడలున్టి - వెలగల గిన్నె -
నా - కలిమిగా జేయున్ గనుక

బ్రతుకంతటన్ - కృ- పా క్షేమముల్ =
వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గు -
నా - పదలు సంపదలౌ గనుక

దురితంబులుండు - ధరణి నాకు =
ఇరవు కాదిక నెప్పటికినా - పరమ దేవుని -
మం - దిరమె నా యిల్లు గనుక

కావలసిన వెల్ల - కనబడగలవు =
ఏవి యడిగిన - వాని నిచ్చి
వేయును తండ్రి – ఇచ్చి

ధన సహాయంబు - మనకు గల్గు =
అనుదినంబు - తండ్రి మనకు
అక్కరలు తీర్చు - మన

ప్రభువు దూతలును - పరిశుద్ధులున్
విభవముగ మన మధ్య- మసలుచు
వెలుగు చుందురుగా - హా

జనకుని ఇష్ట జనము వచ్చు -
తనకు యిష్టము గాని జనమును -
దరికి రానీయడు - ఈ

మా మిత్రులైన - మహిమ దూతలే
క్షేమమునకై మా చుట్టు - చేరి
కాయుదురు - చుట్టు

అందరు మేళ్ళు - అనుభవింప =
విందుగా సమకూడు వార్తలు -
విని పించును - తండ్రి

ప్రభుని శరీర - రక్తములు =
ఉభయ జీవితములకు మేలై-
ఉండును నాకు - మేలై

నైజ పాపములు - నశియించుటకే =
భోజనము వడ్డించును -
రాజే స్వయముగా – దేవ

నీ మనసులోనివి - నెరవేరును =
క్షేమము గనే ఉండవలయు -
చింత లేకుండ – నీవు

నాకు నా తండ్రి - నర రూపముతో =
త్రైకుని రీతిగా కనబడి -
ధైర్య మిచ్చును – నాకు

జనక సుతాత్మ - లను దేవుడు =
ఘనముగా యుగ యుగములన్నిట -
వినుతు లొందును - నేనా - యన గొర్రెనే గనుక

427. Nadipinchuma Nitho Saha Payaninchuma Natho Sada

నడిపించుమా నీతో సహా
పయనించుమా నాతో సదా
ఇహనుండి పరలోక రాజ్యంబునకు

గాఢాంధకారములో పయనించగా
సుడిగాలి నాయందు ప్రసరించగా
నీవే వున్నావని నీవె నా దైవంబని
నీ వాక్యం నా బాటకు వెలుగిచ్చు దీపము
నే భయమొందను

లోకవ్యూహాన నా ఆత్మ సమసి
లోకమార్గాన నా దేహమలసి
లోక మాయా విశేషంబు పిలిచి నన్ను ఓడించగా
నా ప్రాణాశ వీడగ సమయాన
నా ప్రాణాలను బ్రతికించి కృపగాంచితి
ప్రేమా రుధిరంబుచే ప్రాణంబు బ్రతికించితే
నీ వాక్యం నా బాటకు వెలుగిచ్చు దీపము
నే భయమొందను

నేను యవ్వనమ్ము బలము ధరించి
నేను నా ధ్యాన న్యాయములో మురిసి
నేను నా కీర్తికై శ్రమలో సమసి నేలపై కూలితి
నా అంతరంగాన వ్యధ చెందినే
నను లేపి నడిపే సహాయంబుకై
నా చేతులు చాపగా నీ చేయి నను లేపగా
నీ వాక్యం నా బాటకు వెలుగిచ్చు దీపము
నే భయమొందను

426. Devude Nakasryambu Divyamaina Durgamu

దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||


425. Ee Dinama Sada Na Yesuke Sontham

ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)
రానున్న కాలము – కలత నివ్వదు (2)
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును       ||ఈ దినం||

ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం||

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము         ||ఈ దినం||

424. Snehithudu Prana Priyudu Ithade Na Priya Snehithudu

       స్నేహితుడు - ప్రాణ ప్రియుడు - ఇతడే నా ప్రియ స్నేహితుడు
       నా సమీప బంధువుడు - దీనపాపి బాంధవుడు

 1.    తోడు నీడలేని నన్ను చూడ వచ్చెను 
       జాడలు వెదకి జాలి చూపెను
       పాడైన బ్రతుకును బాగుచేసెను - ఎండిన మోడులే చిగురించెను
       వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా

2.    దాహము గొనినే దూరమరిగితి - మరణపు మారా దాపురించెను
       క్రీస్తు జీవం మధురమాయెను - క్షీర ద్రాక్షలు సేద దీర్చెను
       వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా

 3.   బాధలలో నన్ను ఆదరించెను - శోధనలందు తోడు నిల్చెను
       నా మొరలన్నియు ఆలకించెను - నా భారమంతయు తొలగించెను
       వినుమా క్రైస్తవమా - వినుమా యువతరమా

423. Solipovaladu Manasa SoliPovaladu

       సోలిపోవలదు మనసా సోలి పోవలదు
       నిను గని పిలచిన దేవుడు విడిచిపోవునా

 1.    ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా
       ప్రియుడు యేసు చేరదీసినా ఆనందం కాదా

 2.   శోధనలు జయించువాడు భాగ్యవంతుడు
       జీవ కిరీటం మోయువేళ ఎంతో ఆనందం

 3.   వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు
       సేద దీర్చె ఆత్మ నిన్ను చేర ప్రార్ధించు 

422. Sahodarulu Ikyatha Kaligi Nivasinchuta

       సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
       ఎంతమేలు ఎంత మనోహారం
       ఎంత మధురం ఎంత సంతోషం

 1.    నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలెను
       మొవ్వ వేయుచు దినదినం వర్ధిల్లెదరు      ||2||
       లెబానోను పర్వతముపై దేవదారు వృక్షాలవలెను
       దేవుని సన్నిధిలో నిలిచి ఉండెదరు   ||2||

2.    దినములు చెడ్డవి గనుక సమయం పోనియ్యక
       వినయ మనస్సుతో ప్రభు సన్నిధిలో వేడుదము ||2||
       అజ్ఞానుల వలెకాక జ్ఞానుల వలె మనము
       యేసయ్య బాటలో పయనించెదము  ||2||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...