A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word in your language.
About Me

- V G Ratnam
- I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.
📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.
Saturday, 22 October 2016
270. Veerude Lechenu Maranapu Mullunu Virachi
269. Vijaya Geethamu Manasara Nenu Padeda
విజయగీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన
ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో ||పునరు||
ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది ||పునరు||
నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే
నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||పునరు||
268. Randi Viswasulara
రండు విశ్వాసులారా-రండు విజయము
సూచించు - చుండెడు సంతోషంబును
గల్గి - మెండుగ నెత్తుడి రాగముల్
నిండౌ హర్షము మనకు – నియమించె దేవుడు
విజయం విజయం విజయం విజయం విజయం
నేటి దివస మన్ని యాత్మలకును
నీటగు వసంత ఋతువగును
వాటముగ చెరసాలను గెలిచె
వరుసగ మున్నాళ్ నిద్రించి = సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్
విజయం విజయం విజయం విజయం విజయం
కన్ను కన్ను కానని చీకటి
కాలము క్రీస్తుని కాంతిచే - ఇన్నాళ్ళకు
శీఘ్రముగా బోవు - చున్నది శ్రీయేసుని
కెన్నాళ్ళ కాగని - మన సన్నుతుల్ భువిన్
విజయం విజయం విజయం విజయం విజయం
బలమగు మరణ ద్వార బంధములు
నిన్ బట్టకపోయెను - వెలుతురు
లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక
పోయెను గెలువ వాయెను
విజయం విజయం విజయం విజయం విజయం
పన్నిద్దరి లోపల నీ వేళ-సన్నుతముగ
నీవు నిలిచి-యున్నావు మానవుల
తెలివి - కెన్నడైన నందని = ఔన్నత్య
శాంతిని అనుగ్రహింతువు
విజయం విజయం విజయం విజయం విజయం
267. Yuda Raja Simham Thirigi Lechenu
యూదా రాజ సింహం - తిరిగి లేచెను
తిరిగి లేచెను - మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం - యేసుప్రభువే
యేసుప్రభువే - మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం - తిరిగి లేచెను
నరక శక్తులన్నీ - ఓడిపోయెను
ఓడిపోయెను - అవన్నీ రాలిపోయెను
యేసు లేచెనని -రూఢియాయెను
రూడియాయెను - సమాధి ఖాళీ ఆయెను
పునరుత్థానుడిక - మరణించడు
మరణించడు - మరెన్నడు మరణించడు
యేసు త్వరలో - రానైయున్నాడు
రానైయున్నాడు - మరల రానైయున్నాడు
266. Marananni Gelichina Deva Ninne Aradhinchedanayya
మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
ప్రాణముతో గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
అభిషేకనాధుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా
సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్య
హల్లెలూయ హోసన్న
265. Jayahe Jayahe Jayahe Jahaye
264. Jayamu Keerthanalu Jaya Sabdamutho
Wednesday, 7 September 2016
263. Jaya Jaya Yesu Jaya Yesu
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ ||
మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ క్రీస్తు (2)
పరమ బలమొసగు జయ యేసు (2)
శరణము నీవే జయ యేసు || జయ జయ ||
సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు || జయ జయ ||
సాతాన్ను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ క్రీస్తు (2)
పాతవి గతియించే జయ యేసు (2)
దాతవు నీవే జయ యేసు || జయ జయ ||
బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ క్రీస్తు (2)
బండలు దీయుము జయ యేసు (2)
అండకు చేర్చుము జయ యేసు || జయ జయ ||
ముద్రను గెల్చిన జయ యేసు
ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)
ముద్రలు జీల్చుము జయ యేసు (2)
ముద్రించుము నను జయ యేసు || జయ జయ ||
కావలి గెల్చిన జయ యేసు
కావలి ఓడెను జయ క్రీస్తు (2)
సేవలో బలము జయ యేసు (2)
జీవము నీవే జయ యేసు || జయ జయ ||
దయ్యాలు గెల్చిన జయ యేసు
దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)
కయ్యము గెల్చిన జయ యేసు (2)
సాయము నీవే జయ యేసు || జయ జయ ||
262. Kristhu Lechenu Halleluya
క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్ను లేపును
ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము
మృతుల పునరుత్థాన పంటకు ప్రధమ ఫలమగు క్రీస్తులో
మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది
పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను
పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము
మరణమా నీ ముల్లు ఎక్కడ? మరణమా జయమెక్కడ?
మరణమా నీ ముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు
శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలియాను రాత్రిలో
ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో
మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము
ప్రేతలను జీవింపజేయును పృధివి క్రీస్తుని విజయము
స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా
స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి
261. Emayenu Emayenu Apavadi Yatnalu Emayenu
260. Hey Prabhu Yesu Hey Prabhu Yesu
Netho Unte Jeevitham | Telugu Christian Song # 595
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...
