Tuesday, 21 November 2017

301. Nee Jeevithamlo Gamyambu Edo Okasari Yochinchava

నీ జీవితములో గమ్యంబు ఏదో
ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు
నీ హృదయమర్పించవా (2)     ||నీ ||

నీ తల్లి గర్భమున నుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు ఆ ఆ..(2)
యోచించినావా  ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2)         ||నీ ||

నీలోన తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను ఆ ఆ..(2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2)         ||నీ ||

తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే ఆ ఆ..(2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2)         ||నీ ||

ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా ఆ ఆ..(2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ         ||నీ ||

Monday, 20 November 2017

300. Nasiyinchu Athmalanu Rakshimpa Yesu Prabhu

నశియించు ఆత్మలను రక్షింప యేసుప్రభు
ఆశతో వెదుకుచును నీ కొరకేతెంచే
వేడుమ శరణు ఓ యువకా
కోరుమ శరణు ఓ యువతీ                  II నశియించుII

సిలువలో కారెనుగా - సెలయేరుగ రుధిరంబు
చాచిన చేతులతో - దావున చేరెనుగా
నీ సహవాసముకై - నిలిచెను వాకిటను
హృదయపు తలుపు – తీయుము       II నశియించుII

ఈ యువతరమంతా - దేవుని సేవకులై
రక్షణ పొందగను - యేసుడు కోరెనుగా
సోమరివై సమయం - వ్యర్ధము చేయుదువా
క్రీస్తుకు నీహృది – నీయుమా              II నశియించుII

యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
ఓ యువకా - ప్రభుని వేదన గాంచితివా
రయమున సాగుమయా - రక్షణ కోరుమయా
యేసుని శరణు – వేడుము             II నశియించుII

299. Na Pere Theliyani Prajalu Endaro Unnaru

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా (2)
వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)

రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలదిగ ఉన్నారు
మారుమూల గ్రామాల్లో –ఊరి లోపలి వీధుల్లో||ఎవరైనా||

నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు         ||ఎవరైనా||

వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి        ||ఎవరైనా||

298. Chatinchudi Manushya Jathikesunamamu

చాటించుడి మనుష్యజాతి కేసు నామము
చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము
జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము
చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము

కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో
నెన్నడు గోయుదు రనెడి వాగ్ధత్తంబుతో
మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో
చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము – చక్కని మార్గము

సమీపమందు నుండునేమో చావు కాలము
సదా నశించిపోవువారికీ సుభాగ్యము
విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము
చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము – సత్య సువార్తను

297. Kristhe Sarvadhikari Kristhe Mokshadhikari

క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి       ||క్రీస్తే||

ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరంబు వీడె గాన       ||క్రీస్తే||

దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన       ||క్రీస్తే||

శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన       ||క్రీస్తే||

సాతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంచ – రుధిరంబు గార్చె గాన       ||క్రీస్తే||

మృత్యువు ముళ్ళు త్రుంపన్ – నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే||

పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన       ||క్రీస్తే||

ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే||

296. Kristuni Gurchi Meku Emi Thochuchunnadi

క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది
పరుడని నరుడని పొరపడకండి
దేవుని కుమారుడు ఈయన దేవుని కుమారుడు

 1.           ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందే ఆనందము
               తండ్రియే పలికెను తనయుని గూర్చి మీకేమి తోచుచున్నది

 2.           రక్షకుడనుచు అక్షయుని చాటిరి దూతలు గొల్లలకు
            ఈ శుభవార్తను వినియున్న్టి మీకేమి తోచుచున్నది

 3.           నీవు దేవుని పరిశుద్ధుడవు మా జోలికి రావద్దనుచు
            దయ్యములే గుర్తించి చాటగా మీకేమి తోచుచున్నది

 4.           నీవు సజీవుడవైన నిజముగ దైవ కుమారుడవు
            క్రీస్తువు నీవని పేతురు పలుకగా మీకేమి తోచుచున్నది

 5.           నిజముగ ఈయన దేవుని కుమారుడేయని సైనికులు
            శతాధిపతియే సాక్షమియ్యగా మీకేమి తోచుచున్నది

 6.           కన్నులు లేని కబోదిని గాని చూచుచుంటినని       
            అంధుడు పలికిన చందము చూడగా మీకేమి తోచుచున్నది

 7.           మర్మములెరిగిన మహనీయుడ మరుగై యుండకపోతినని
            సమరయ స్త్రీయే సాక్ష్యమియ్యగా మీకేమి తోచుచున్నది

295. Kadavari Dinamulalo Kavali Ujjeevam

కడవరి దినములలో కావాలి ఉజ్జీవం

యేసుని అడుగులలో నడవాలి యువతరము

భావిభారత పౌరులారా కదలిరండి ఉత్తేజంతో

క్రీస్తురాజ్య వారసులారా తరలిరండి ఉద్వేగంతో

క్రీస్తు సిలువను భుజమున మోస్తూ ఆసేతు హిమాలయం

యేసు పవిత్రనామం ఇలలో మారు మ్రోగునట్లు

విగ్రహారాధనను భువిపై రూపుమాపేవరకు

భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యేవరకు

కదలి రావాలి యువజనము కలిసి తేవాలి చైతన్యం   ||2|| ||భావి||

కులము మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి

యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు

మూఢనమ్మకాలు భువిపై సమసిపోయేవరకు

అనాగరికులు మతోన్మాదులు మార్పు చెందే వరకు

కదలి రావాలి యువజనము కలిసి తేవాలి చైతన్యం   ||2|| ||భావి||

294. Oranna Oranna Yesuku Sati Vere Leranna Leranna

ఓరన్నా…  ఓరన్నా
యేసుకు సాటి వేరే లేరన్నా… లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా                            ||ఓరన్నా||

చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)                    ||ఓరన్నా||

పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)                    ||ఓరన్నా||

సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)          ||ఓరన్నా||

మహిమలు ఎన్నో చూపాడన్నా చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా అన్నాడన్నా
మనిషిగ మరీనా దేవుడెగా
మరణం పాపం తొలగించెను 
(2)                ||ఓరన్నా||

293. Edo Okati Edo Okati Cheyali Mana Yesu Rajunaku

ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి - మన యేసు రాజునకు
స్తుతియించాలి - ప్రార్ధించాలి
తరిమివేయాలి - సాతాన్ని త్రొక్కివేయాలి

1.            విడవాలి పాపమార్గము - ప్రార్ధించాలి ప్రభు సన్నిధిలో  ||ఏదో||
 2.           చదవాలి ప్రభువాక్యము - ధ్యానించాలి దైవ వాక్యము   ||ఏదో||  
 3.           వెళ్ళాలి దేశమంతయు - చాటించాలి మన యేసు ప్రేమను ||ఏదో||
 4.           రక్షించాలి ఆత్మలను - యేసు కొరకు మన క్రీస్తు కొరకు ||ఏదో||
 5.           ప్రకించాలి సువార్తను - మన ప్రార్ధనతో మన అర్పణతో ||ఏదో||
 6.           వస్తున్నాడు యేసు మేఘార్హుడై - సిద్ధపడాలి ప్రభు రాకడకై ||ఏదో||

292. Entha Madhuramu Manakentho Madhuramu Yesu Namame Athi Madhuryam Madhuryam

ఎంత మధురము - మనకెంతో మధురము

యేసు నామమే - అతి మాధుర్యం

క్రీస్తు నెరుగుటే - మన కానందం ఆనందం

కుంటివారు గెంతుచూ నడిచినారుగా

గుడ్డివారు దృష్టిని పొందినారుగా

కుష్టువ్యాధి గలవారు స్వస్థత పడినారుగా ఆ...ఆ.

మూగవారు ముద్దుగా మాటలాడినారుగా

యాయీరు కుమార్తెను బ్రదికించినాడుగా

లాజరును సమాధి నుండి లేపినాడుగా

దయ్యముల పిశాచములను వెళ్ళగ్టొినాడుగా ఆ...ఆ

అందరికి ఆ ప్రభువు అతి ఘనడైనాడుగా

అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలున్‌

అయిదు వేల మందికి ఆహారమిచ్చెగా

పండ్రెండు గంపలు యింక మిగిలినాయిగా ఆ...ఆ

అందరికి ఆ ప్రభువు అతి ప్రియుడైనాడుగా

మన పాప శిక్షను తానె భరించెగా

సమాధి జయించి ప్రభువు తిరిగి లేచినాడుగా

సాతానును మరణమును చిత్తుగ ఓడించెగా ఆ...ఆ

అందరిలో ఆ ప్రభువు అతి విజయుడాయెగా

291. Idigo Vinuma O Lokama Thvaralo Prabhuvu

ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా       

మరనాత...              ||ఇదిగో||

మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో

దేవుని బూరతో ప్రభువు వేగమే దిగివచ్చును   

ప్రభునందు మృతులు లేతురు సమాధులు తెరువగ

విశ్వాసులంత దాల్తురు మహిమ రూపును వింతగ

ఎత్తబడును సంఘము అయ్యో విడువబడుట ఘోరము

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా       

మరనాత...            ||ఇదిగో||

ఏడేండ్లు భువిపై శ్రమకాలం - ప్రాణాలు జారే భయకాలం

ఊరలు తెగుళ్ళు దైవ ఉగ్రత పాత్రలు

ఆకాశ శక్తుల్‌ కదలును గతి తప్పును ప్రకృతి

కల్లోలమౌను లోకము రాజ్యమేలును వికృతి

సంఘమెంతొ హాయిరా మధ్యాకాశన విందురా

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా       

మరనాత...            ||ఇదిగో||

అన్యాయము చేయువాని చేయనిమ్ము

అపవిత్రుడట్లే యుండనిమ్ము

పరిశుద్ధుడింకను పరిశుద్ధునిగుండనిమ్ము

ప్రతివాని క్రియల జీతము ప్రభు తెచ్చును ఒక దినం

రహాస్య క్రియలు అన్నియు బయలుపడునులే ఆ దినం

లోక ధనము కూడిరా నీకుంద పై సంపద ఆ...ఆ...

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా    

మరనాత...            ||ఇదిగో||

ఓలీవకొండపై రారాజు అడుగుపెట్టెడి ఆరోజు

కొండయే చీలును భూగోళమే కంపించును

ప్రతి జనం ప్రభునే చూచును ప్రతి జాతియు మ్రొక్కును

నిజమైన ప్రభువు యేసని ప్రతి నాలుక ఒప్పును

ప్రభుని రెండవ రాకడ సాతానుకు దడదడ ఆ....ఆ...

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా      

మరనాత...            ||ఇదిగో||

వెయ్యేండ్లు భూమిపై ప్రభు యేసు పాలించును పరిపాలించును

నీతి సమాధానం ఆత్మయందలి ఆనందం

ఈ భూమ్మీద నీ కృత్యముల్‌ సమస్తం కాలిపోవును

మిక్కటమైన వేడితో పంచభూతముల్‌ లయమగును

క్రొత్త భూమి ఆకాశం ఇక శాశ్వత జీవితం

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా       

మరనాత...            ||ఇదిగో||

క్రీస్తేసులో విశ్వసించువారే పరిశుద్ధులుగా తీర్చబడ్డవారే

దేవుని మహిమకు నిత్యజీవమునకు అర్హులు

జీవం మరణం రెండును నీ యెదుటనే యున్నవి

ప్రభు యేసే జీవ మార్గమని నీకు తెలుపబడియున్నది

విశ్వసించు ప్రియుడా కాదు ................................

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా      

290. Idigo Idigo Idigo Idigo Ide Ide Ide Idigo

ఇదిగో ఇదిగో ఇదిగో ఇదిగో - ఇదె ఇదె ఇదె ఇదిగో

ఇదె ఇదె ఇదె ఇదిగో

ఇదియే మిక్కిలి అనుకూల సమయము 

ఇదియే ఘనరక్షణ దినము

ఇప్పుడే యేసుని తప్పక నమ్మి ఆఆఆఆ

రక్షణ పొందుము సోదరా

పాప మెరుగని యేసుక్రీస్తు 

పాపముగను చేయబడె

శాపగ్రాహి ఆయె సిలువలో ఆఆఆఆ

శ్రమలను పొందెను సోదరా

ఆకాశము క్రింద మనుష్యులలో 

ఏ నామమున రక్షణ లేదు

యేసు నామమున రక్షణ కలుగును ఆఆఆఆ

ఇప్పుడే నమ్ముము సోదరా

నేనే ద్వారము నా ద్వారానే 

లోపల ప్రవేశించిన యెడల

రక్షింపబడునని చెప్పిన ప్రభు ఆఆఆఆ

చెంతకు చేరుము సోదరా

ఇంతగొప్ప రక్షణను మనము 

నిర్లక్ష్యము జేసిన యెడల

ఏలాగు తప్పించుకొందుము ఆఆఆఆ

ఇప్పుడే తిరుగుము సోదరా

289. Ascharyakarudu Alochana Kartha Nithyudagu Thandri

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
నీవంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు
నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు  (2)  

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) 

288. Sharonu Maidanamutho Samamaina Madananbu

షారోను మైదానముతో - సమమైన మైదానంబు -
రాజ్యమందు లేదు - ఎంచిచూడగా

1.            ప్రభుయేసు రూపే సంఘ - వధువు ధరియించె నామె
               విభవ మేమంచు నేను - వివరింపగలను

2.            స్వీయ రక్తమున ప్రభువు - చిన్ని కన్నియను శుద్ధి
               జేయ పావురము విం - దాయె స్థిరముగను

3.            నిష్పక్ష పాతముతోడ - నిజము చెప్పవలెనన్న
               పుష్పవన మిదియొకటియే - పూర్ణార్ధంబున

4.            పరమార్ధ కీర్తనంబు - పాడించినదియె యీ
               సరసమైన పుష్పాల - షారోను పొలము

5.            షారోను పుష్పము విం - సంఘ వధువునకు క్రీస్తు
                రూపమిచ్చెనో నే నెన్నగలనా

6.            నానా వర్ణాల పువ్వుల్‌ - నరదృష్టి నాకర్షించు
               మానవశుద్ధి ప్రభుని - మదినాకర్షించు

7.            సర్వ పుష్పాలయందు - సంఘవధువె పుష్పంబు
               ఊర్విని సిద్ధమౌను - ఉండు పరమందు

8.            సూర్యుండు పువ్వులకెంతో - సొగసైన రంగులద్దున్
               సూర్యుండైనట్టి  యేసు - శుభగుణములద్దున్

9.            యద్దకంబు వాడి - అంతర్ధానంబైపోవు
                యద్దకంబుపోదు - ఇది శాశ్వతముండు

10.          వివిధ వర్ణములుగల - విశ్వాసులను పుష్పాలు
               భువిమీద మొల్చునట్టి   - పుష్పసంఘంబు

11.         సభను గురించియునా - ప్రభుని గురించియున్న
              శుభవార్త వినుచు చెప్పుచు - సుఖియింపగలను

287. Vardhilledamu Mana Devuni Mandiramandu

వర్ధిల్లెదము మన దేవుని
మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే

యెహోవా మందిర ఆవరణములో
ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి
అనుభవింతుము ప్రతిమేలును

యేసయ్య సిలువ బలియాగములో
అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి
పొందెదము శాశ్వత కృపను

పరిశుద్ధాత్ముని అభిషేకములో
ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మన
దుఃఖము సంతోషముగ మార్చును

286. Banda Sanduna Pavurama

బండసందున పావురమా - పేటుబీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా
వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా

సిద్ధపడుమా ఓ సంఘమా
క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా
యేసు వచ్చు వేళాయె వేచియుండుమా

ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్ను కోరెను
నీ స్వరము వినిపించుమా - నీ ముఖము చూపించుమా
యేసురాజు దిగువచ్చు వేళ ||2||
నీవు సంసిద్ధమా - నీవు పరిశుద్ధమా            
||సిద్ధ||

కొండ పేటులందున - బండ బీటులందున
నీ గూడు నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా
లోక ఆశలు నీకేలనమ్మా ||2||
సిద్దె వెలిగించుమా - సిద్ధముగ నుండుమా    
||సిద్ధ||

సాగరాలు పొంగినా - నింగి నేలకొరిగినా
భయమేల ఓ సంఘమా - దిగులేల ఓ సంఘమా
బండక్రీస్తే నీ అండనుండ ||2||
గీతములు పాడుమా - నీ ప్రియుని వీక్షింపుమా 
||సిద్ధ||

ద్రాక్షచెట్టు పూతపట్టి - వాసనలిచ్చుచున్నవి
చలికాలమే గడిచెనమ్మా - నిదురేల నీకింకలెమ్మా
వరుడు యేసు దిగివచ్చు వేళ ||2||
తరుణ మేతెంచెనమ్మా - నీ ప్రియుని సంధించుమా 
||సిద్ధ||

Wednesday, 15 November 2017

285. Nee Mandiramai Nenundaga Nayandundi Nadipinchava

నీ మందిరమై నేనుండగా - నాయందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా
వెంబడిస్తాము నిను యేసువా

నీవు కోరేటి దేవాలయం - మాదు దేహంబెగా నిశ్చయం
నీ ప్రత్యక్షతా మాకు కలిగించవా
మా హృదయంబు వెలిగించవా

హన్న ప్రార్ధనలు విన్నావుగా - నేనున్నానని అన్నావుగా
నాడు సమూయేలుతో బహుగ మాట్లాడిన
దేవమందిరమిదె మాట్లాడవా

ఆత్మ సత్యముతో ఆరాధింప
ఆత్మ దేవుండా నేర్పించుమా
సత్యమార్గంబులో మమ్ము నడిపించవా
నిత్యము నిన్ను స్తుతియింతుము

నాడు నిర్మించె దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం
అట్టి దేవాలయము మేము నిర్మించగా
నీ కట్టడలో మమ నిలుపవా

ఆ పరలోక ప్రతిబింబమై - ఈ ధరలోన దేదీప్యమై
ధరణి వెలిగించిన కరుణ ప్రసరింపను
కరము తోడుంచి నడిపించుము

284. Kristhava Sanghama Ghana Karyamulu Cheyu Kalamu

క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా
క్రీస్తుప్రభువు నీ క్రియల మూలంబుగ కీర్తి పొందునని తెలుసునా
కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టుదువు తెలుసునా

1.            పరమధర్మంబులు భాషలన్నియందు ప్రచురింతువని నీకు తెలుసునా
               నరుల రక్షకుడొక్క నజరేతుయేసని నచ్చచెప్పుదువని తెలుసునా
               నడిపింతువని నీకు తెలుసునా నాధుని జూపింతువు తెలుసునా

2.            లెక్కకు మించిన రొక్కము నీచేత చిక్కియుండునని తెలుసునా
               ఎక్కడికైనను ఎగిరివెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా
               చక్కపరతువని తెలుసునా సఫలపరతువని తెలుసునా

3.            యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచట నుండరని తెలుసునా
               యేసులో చేరని ఎందరో యుందురు ఇదియు కూడ నీకు తెలుసునా
               ఇదియే నా దుఃఖము తెలుసునా ఇదియే నీ దఃఖము తెలుసునా

4.            నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువని తెలుసునా
               అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా
               అడ్డురారెవరును తెలుసునా హాయిగనందువు తెలుసునా

5.            నీ తండ్రియాజ్ఞలన్నిని పూర్తిగ నీవు నెరవేర్తువని నీకు తెలుసునా
               పాతాళము నీ బలము ఎదుట నిలువబడనేరదని నీకు తెలుసునా
               భయపడునని నీకు తెలుసునా పడిపోవునని నీకు తెలుసునా

6.            ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కననేకులు తెలుసునా
               చిక్కవు నీవెవరి చేతిలోనైనను చిక్కిపోవని నీకు తెలుసునా
               నొక్కబడవని నీకు తెలుసునా సృక్తిపోవని నీకు తెలుసునా

7.            నేటి అపజయములు నేటి కష్టంబులు కాటిపాలైపోవున్తెలుసునా
               బూటకపు బోధకులు బోయి పర్వతాల చాటున దాగెదరు తెలుసునా
            చాటింపకుందురు తెలుసునా గోటు చేయలేరు తెలుసునా

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...