జడియను బెదరను నా యేసు నాతోనుండగ
జడియను బెదరను నా యేసు నాతోనుండగ
A Telugu Christian resource sharing devotional songs, sermons, and teachings with lyrics, audio, and video. Strengthen your faith, enjoy worship, and experience God’s Word in your language.
కలవర పడవలదు - నీవు కలవరపడవలదు
యేసు
నిన్ను వదలిపెట్టరు
ముళ్ళ మకుటం నీ కోసమే - రక్తమంత నీ కోసమే
పాపమంతా సమర్పించు - నీ పాపమంతా సమర్పించ
పరిశుద్ధునిగా
అవుతావు - నీవు పరిశుద్ధునిగా అవుతావు
కల్వరి శిఖరముపై - గాయపడ్డ యేసుని చూడు
చేయి చాచి పిలుస్తున్నాడు - తన చేయి చాచి పిలుస్తున్నాడు
కన్నీటితో
పరుగిడి రండి - మీరు కన్నీటితో పరుగిడి రండి
ఎల్లప్పుడు నీతో ఉన్నాడు - చేయిప్టి నడిపిస్తున్నాడు
కన్నీటిని తుడిచే దేవుడు - నీ కన్నీటిని తుడిచే దేవుడు
కంటిపాపవలె కాచే దేవుడు - నిన్ను కంటిపాపవలె కాచే దేవుడు
కన్నీటికి
జవాబు ఉంది నీలో వేదన తీరిపోవును
యేసయ్య
విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్ధన
నిను విడువను యెడబాయననీ.. పలికిన యేసే నీ తోడమ్మా
విలపించకు
దిగులొందకు భయమెందకు కలత చెందకు
బూడిదకు
ప్రతిగా పూదండతో అలంకరించును నిన్ను
దుఃఖమునకు
ప్రతిగా ఆనందతైలం అభిషేకించును
ఉల్లాస
వస్త్రములు ధరియింప జేయును
అవమానమునకు
ప్రతిగా ఘనతొందెదవు
భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము
నీకొసగే
వేళ ఇదే.. నీ కొసగే వేళ ఇదే
దేవుని మహిమ నీ పైన ఉదయించెను చూడుము
దేవునికి
స్తోత్రములు చెల్లింతుము జయముగ హర్షింతుము
లెమ్ము
తేజరిల్లు సంతోష గానముతో
యేసుని
నామమే బలమైన ఆశ్రయం
నా కృప నీకు చాలునని పలికెను
ప్రభు
యేసే ఆభరణం.. ప్రభు యేసే నీ కాభరణం
ఎవరైనా
ఉన్నారా ఎచటైనా ఉన్నారా
ఈలాంటి
స్నేహితుడు
నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి
ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు
హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండ
ప్రేమచూపు
వారు లేరు లోకమందునా
నేను కోరుకోకుండా నా కోసము
తనకు
తానే చేసినాడు సిలువ యాగము
అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
జతను
కోరువారు దొరకరు ఎంత వెదికినా
నీచుడనని చూడకుండా నా కోసము
మహిమనంత
వీడినాడు ఏమి చిత్రము
స్వార్ధము లేకుండా ఫలితం ఆశించకుండా
మేలుచేయువారు
ఎవరు విశ్వమందునా
ఏమి దాచుకోకుండా నా కోసము
ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము
ఆనందం మహానందం - నా ప్రియుని స్వరం మధురం
ముఖము
మనోహారం - ప్రియుని ముఖము మనోహారం
నశియించిన పాపిని నేను - శాశ్వతమైన కృపజూపి
నా
యేసుడెగా రక్షించెనుగా - నా ప్రభువును సేవింతునుగా
వేడుకతో విందుశాలకు నన్ - తోడుకు వెళ్ళును నా ప్రియుడు
కోరిన
ఫలములు తినిపించును - కూరిమితో నా ప్రియ ప్రభువు
ఆనందభరితనై నేను - అతని నీడను కూర్చుందున
వాడబారను
యేనాికి - వరదుని బాడుచు నుండెదను
ఎంతో ప్రేమతో ప్రేమించి - వింతగను నను ప్రభు దీవించె
అంతము
వరకు యేసుని చెంతనే - నుందును ఆనందముతోను
రాజగు యేసు వచ్చునుగా - రాజ్యము నాకు తెచ్చునుగా
రాజ్యమునందు
నే రాణిగాను - రమ్యముగ నేనుందునుగా
నిలబడుమా ఓ మనసా
కడవరకు షారోనులో (2)
కష్టము నష్టము లెన్నో వచ్చిన
కలవర పడకుము రాకడ వరకు (2) IIనిలII
తప్పిపోయిన గొర్రెవలె
దారి విడువక నిలబడుము (2)
ప్రాణ ప్రియుండు ప్రభుయేసు
ప్రాణము పెట్టెను మనకొరకు (2) IIనిలII
ఆపదలు చెలరేగి
ఆవరించిన భయపడకు (2)
ఆత్మబలుండు శ్రీయేసు
ఆదరించును మేల్కొనుము (2) IIనిలII
నిలువుము ప్రభు సన్నిధిలో
కలవు సిరి సంపదలు (2)
వెదకిన దొరకును ఫలములు నీకు
వెరువక మెప్పుడు ఓ మనసా (2) IIనిలII
మాటకు మాటలు మార్చకుము
మహిమను విడిచి వెళ్ళకుము (2)
మహిమగల ప్రభు శ్రీయేసు
మాట వినుమా ఓ మనసా (2) IIనిలII
మొదటి వనము ఏదేను
రెండవది సింధూర వనము (2)
మూడవది గెత్సేమనె వనము
నాల్గవది షారోను వినుము (2) IIనిలII
నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము (2) ||నిబంధనా||
అబ్రాహాము నీతికి వారసులం
ఐగుప్తు దాటిన అనేకులం (2)
మోషే బడిలో బాలురము (2)
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం ||యేసు రాజు||
విశ్వాసమే మా వేదాంతం
నిరీక్షణే మా సిద్ధాంతం (2)
వాక్యమే మా కాహారం (2)
ప్రార్ధనే మా వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం ||యేసు రాజు||
అశేష ప్రజలలో ఆస్తికులం
అక్షయుడేసుని ముద్రికులం (2)
పునరుత్థానుని పత్రికలం (2)
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం ||యేసు రాజు||
నజరేయుని ప్రేమ పొలిమేరలో
సహించుటే మా ఘన నియమం (2)
క్షమించుటే ఇల మా న్యాయం (2)
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం ||యేసు రాజు||
క్రీస్తేసే మా భక్తికి పునాది
పునరుత్థానుడే ముక్తికి వారధి (2)
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి (2)
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం ||యేసు రాజు||
ఎవరీ యేసని అడిగేవో
ఎవరోలే యని వెళ్ళేవో (2)
యేసే మార్గం యేసే జీవం (2)
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం ||యేసు రాజు||
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి – ఆయనే నీ ముందు నడచువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని||
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని||
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని||
పర్వతములు తొలగి పోయినను – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||
జగమేలే ఓ ఘనదేవా!
అగుపించని నను కరుణించు
నా కనులను తెరువుము దేవా!
పుట్టంధుడనై ముష్టి బ్రతుకుతో
పొట్ట పోసుకొనుచుంటినయ్యా
కనిపించని నా తలిదండ్రులలో
ఎవరిని
చూచి మురిసెదెనో
పరమాత్ముని లీలలు ఎరుగనయ్యా
పగిలిన మదిని కుదుట పరచుము
వేడెదను ఓ దేవా
నీవె వెలుగువని నిన్నె చూడుమని
పిలిచితి పలుకులు పలుకగనే
లోకము చీకటై శోకము మ్రోగె
చితికితి బాధలలోన
తలవాల్చేనా భజబలమా
కరుణతో నా కనుపాపను తెరువుము
వేడెదను ఓ దేవా
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...