Friday 9 March 2018

398. Dhanyudu Deva Manavudu Dhanyudu

ధన్యుడు దేవ మానవుడు
ధన్యుడు - ధన్యుడు దైవజనుడు
ధరణి జనులందరి కన్న- అన్యులెంతటి
వారైన అతనికి సాటి రారు

చెడుగుల యోచనలందు - నడువని వాడై పాపులు
అడుగు బెట్టుదారుల- యందు నిలువని యతడు

పరిహసించు వ్యతిరేక - ప్రజలు గుమిగా గూర్చుండు
దరిని గూర్చుండ నట్టి - నరుడెవ్వడో యతడు

మురియు దైవాజ్ఞలున్న - పరిశుద్ధ శాస్త్రము జూచి
మురియుచు రేబగళ్ళు- స్మరియించుచుండు నతడు

అతడేటి యోర మొలిచి - ఆకు వాడనిదై తగిన
ఋతువున గాయు చెట్టై - హెచ్చరిల్లును గాన

అతడు తలపెట్టి చేయ - యత్నించు నెల్ల పనులు
సతతము సంపూర్ణముగ సఫల మగుచుండును గాన

ఆలా గుండకను దుష్టుల్ - గాలి కొట్టిన పొట్టున్
బోలిన వారై చెదరి - పోదు రంతర్ధానంబై

కాన దుష్టుల్ తీర్పు - లో నిల్వ నేలేరు
హీనుల్ నీతి పరుల - లో నాగనే లేరు

పరమ దేవునికి నీతి - పరుల మార్గంబు తెలియు
దురితుల పన్నాగములు - సరిగా కీడునకే నడుపు

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...