Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
Wednesday, 31 August 2016
248. Edu Matalu Palikinava
247. Entha Goppa Bobba Puttenu
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - దానితో రక్షణ యంతయును సమాప్త
మాయెను = ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు
గల్వరి మెట్టను సంతసముతో సిల్వ గొట్టగ -
సూర్యుండంధకార మాయెను
గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడమును కట్టు
నప్పుడు = పలుకు భాషయు - నొక్కటైనను - పలువిధములగు
భాషలాయెను - నలు దెసలకును - జనులు పోయిరి కలువరి
కలుసుకొనిరి
పావనుండగు ప్రభువు మన కొరకై - యా సిలువ మీద చావు
నొందెడు = సమయమందున - దేవుడ నా దేవుడ - నన్నేల
చెయి విడిచితివి యని యా - రావముగ మొరబెట్టెను
యె - హోవయను దన తండ్రితోన
అందు దిమిరము క్రమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత
చుట్టెను బంధకంబులు - నింద వాయువులెన్నో వీచెను కందు
యేసుని యావరించెను - పందెముగ నొక కాటు వేసెను -
పాత సర్పము ప్రభువు యేసును
సొంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు తన - స్వంత
విలువగు ప్రాణమును వీడెన్ - ఇంతలో నొక భటుడు
తనదగు నీటెతో ప్రభు ప్రక్కబొడువగ - చెంత చేరెడి
పాపులను రక్షించు రక్తపు ధార గారను
246. Aha Mahatmaha Sarnya
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా||
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా||
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా||
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా||
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా||
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||
245. Amulya Rakthamu dwara Rakshana pondina janulara
అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా - పరిశుద్ధులారా పాడెదము
ఘనతా మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము
మన యవ్వన జీవితముల్ - శరీరాశకు లోబరచి
చెడు మాటలను బలుకుచు - శాంతిలేక యుంటిమి
చెడుమార్గమున పోతిమి - దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి
కనికరము గల దేవుడు - మానవ రూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిచేసి - మనల విమోచించెను
తన రక్త ధారలలో - మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో
పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము
మన రక్షకుని స్తుతించెదము మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము - ఆత్మ జీవ శరీరములన్
244. Adigadigo Alladigo Kalvari Mettaku Daradigo
అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
అచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో||
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో||
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో||
చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
మూడవసారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకోయను కూతదిగో (2) ||అదిగదిగో||
యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే (2)
నీలో దోషము కనుగొనలేక (2)
చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో||
గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో||
గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో||
దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||
243. Vandanambonarthumo Prabho Prabho
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనం బోనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయు శుద్ధాత్ముడ
వందనంబు లందుకో ప్రభో
ఇన్నినాళ్లు ధరను మమ్ము బ్రోచియు
గన్నతండ్రి మించి యెపుడు గాచియు
ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా
యన్నిరెట్లు స్తోత్రములివిగో
ప్రాత వత్సరంపు బాప మంతయు
భీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగు మా
దాత క్రీస్తు నాధ రక్షకా
దేవ మాదు కాలుసేతు లెల్లను
సేపకాళి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా
కోత కొరకు దాసజనము నంపుము
ఈ ధరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబులెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడ
మా సభలను పెద్దజేసి పంచుము
నీ సువార్త జెప్పశక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంతద్రోయుము
యేసుకృపన్ గుమ్మరించుము
242. Krotha Yedu Modalubettenu
585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana
తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...
-
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2|| మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2...
-
నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం నా హృదయానికి హృదయం నీవే నీవే నా పాదాలకు దీపం నా నావకు తీరం నా పయనానికి గమ్యం నీవే నీవే నా కొండ ...
-
ఆరాధన చేతును అన్ని వేళలా.... ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2" నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు .... నన్ను కన్న తండ్రి నా యేసుకు.......