Index-Telugu

Tuesday, 27 February 2018

390. Evaraina Unnara Echataina Unnara

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

ఈలాంటి  స్నేహితుడు

నా యేసయ్య లాంటి  మంచి స్నేహితుడు

ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు

హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండ

ప్రేమచూపు వారు లేరు లోకమందునా

నేను కోరుకోకుండా నా కోసము

తనకు తానే చేసినాడు సిలువ యాగము

అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా

జతను కోరువారు దొరకరు ఎంత వెదికినా

నీచుడనని చూడకుండా నా కోసము

మహిమనంత వీడినాడు ఏమి చిత్రము

స్వార్ధము లేకుండా ఫలితం ఆశించకుండా

మేలుచేయువారు ఎవరు విశ్వమందునా

ఏమి దాచుకోకుండా నా కోసము

ఉన్నదంత ఇచ్చినాడు ఏమి త్యాగము

 

9 comments: