Wednesday, 27 July 2016

80. Stuthi Simhasanaseenuda Na aaradhanaku Yogyuda

స్తుతి సింహాసనాసీనుడా - నా ఆరాధనకు యోగ్యుడా ||2||
నాలో నీవుండగ నీలో నేనుండగ - ఇక నేనేల భయపడుదును ||2||   

1. ఆకాశము నీ సింహాసనం - భూమి నీ పాద పీ..ఠం
ఆ సింహాసనం విడిచి సిలువకు దిగివచ్చి ప్రాణ త్యాగము చేసి
నీ ప్రేమామృతం త్రాగించితివి నిను స్తుతించుటకు బ్రతికించితివి

2. రాజాధిరాజా ప్రభువులకు ప్రభువా - ఎవరు నీకిలలో సా..ి
సదాకాలం నిలిచే నీ సింహాసనం జయించిన వారికే సొంతం
ఈ జీవన పోరాటంలో నాకు జయమిచ్చుటకు నీకే సాధ్యం

3. నా రాజ్యం లోక సంబంధమైనది - కానే కాదింవే
నా షాలేము రారాజ స్థాపించితివి నీ బలముతొ ప్రేమ రాజ్యం
మార్పు లేని నీ కృపకు నా ప్రభువా మార్చితివే నీ రాజ్య పౌరునిగ

79. Stuthi Patruda Stothrarhuda Stuthulanduko pujarhuda

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు

1. నా శత్రువులు నను తరుముచుండగ-నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు

2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ
నీవాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో

78. Stuthi Padeda Ne Pratidinamu

స్తుతి పాడెద నే ప్రతిదినము - స్తుతి పాడుటే నా అతిశయము
ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా

1. ఆరాధించెద అరుణోదయమున
అమరుడ నిన్నే ఆశతీర
ఆశ్రిత జనపాలకా అందుకో నా స్తుతిమాలిక
ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా

2. మతిలేని నన్ను శృతి చేసినావే
మృతినుండి నన్ను బ్రతికించినావే
నీ లతనై పాడెద దేవా నా పతివని పొగడెద ప్రభువా
ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా

77. Stuthi Chethumu Niku Deva

స్తుతి చేతుము నీకు దేవ స్తుతి జేతుము నీకు దేవ
స్తుతి జేతుము నీకు
గతియించెను కీడెల్లను గాన ||2||
స్తుతిగానము జేయుదుమో తండ్రి ||2||

1. వేడుకొనక ముందే ప్రార్ధన వినియుింవి దేవా దేవ
నేడును రేపును ఎల్లప్పుడు సమ ||2||
కూడును స్తుతిగానము నీకిలలో
సమకూడును స్తుతిగానము నీకిలలో

2. మనసును నాలుకయు నీకు అనుదిన స్తుతిజేయున్‌ దేవా
జనక కుమారాత్మలకు స్తోత్రము ||2||
ఘనతయు మహిమయు కలుగును గాక ||2||

76. Stuthi Ghana Mahimanthayu

స్తుతి ఘన మహిమంతయు - యేసుకే చెల్లింతము
స్తుతి ఘన మహిమంతయు - మనయేసుకే చెల్లింతుము

1. దూతలారా స్తుతియించుడి - దూత సైన్యమా స్తుతియించుడి
సూర్యచంద్రులారా స్తుతియించుడి - నక్షత్రములారా స్తుతియించుడి

2. పరమాకాశమా స్తుతియించుడి - ఆకాశమండలమా స్తుతియించుడి
అగాధజలమా స్తుతియించుడి - భూమియు సమస్తమా స్తుతియించుడి

3. యౌవ్వనులు కన్యలు స్తుతియించుడి - పిన్నలు పెద్దలు స్తుతియించుడి
వృద్ధులు బాలురు స్తుతియించుడి - నిత్య యేసునామము స్తుతియించుడి

75. Suryodayamu Modalukoni

సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు
పగికి పగలు రాత్రికి రాత్రి
స్తుతియించే నామం యేసునామం ప్రభు యేసునామం

1. సంగీతములతోను కీర్తనలతోను
జయధ్వనులతోను నాట్యములతోను
పాడుచూ కీర్తించుచూ కొనియాడే నామం

2. బూర ధ్వనులతోను గంభీర ధ్వనులతోను
అధిక స్తోత్రములతోను ఆర్భాటములతోను
పొగడుచు వర్ణించుచు సేవించే నామం

3. బహు వినయముతోను భయభక్తులతోను
పూర్ణ బలముతోను పూర్ణ మనస్సుతోను
వేడచూ కొనియాడుచూ ఘనపరచే నామం

74. Sugunala Sampannuda Stuti Ganala Varasda

సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారాసుడా
జీవింతును నిత్యము నీ నీడలో - 
ఆస్వాదింతును నీ మాటల మకరందము

 1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే

 2. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో  

 3. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే     

73. Simhasanaseenudaina na deva

సింహాసనాశీనుడైన నా దేవా...
కొనియాడెదను నిన్నే ఇహమందు
సర్వలోకానికి చక్రవర్తి నా దేవా
స్తుతియించెదను నిన్నె ప్రతిదినము ||2||
జగమంత ఏలుచున్న దేవుడ నీవే
నీ ఆధీనంలో నన్ను ఉంచుమయ్యా
యుగములకు కీర్తనీయుడవు నీవే
నీ ఆత్మను మాపై కుమ్మరించుమయ్యా ||సింహా||

1. నీ మాటలో స్వస్థత నీ చూపులో స్వస్థత
నీ స్పర్శలో స్వస్థత నిలువెల్ల స్వస్థత ||2||
నా దేవా నిను చూచిన క్షణం మైమరచితిని నన్ను నేనే ||2||

2. నీ కృప నా యెడల హెచ్చుగా ఉన్నది
నీ విశ్వాస్యత నాలో నిరంతరం నిలుచును ||2||
పక్షిరాజు యౌవ్వనమువలె  నా ఆత్మబలము నూతనమగును ||2||

3. నీ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు
నీ రక్షణ శృంగము నన్ను ఆదుకొనును ||2||
నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే వచ్చును ||2||

72. Simhasanaseenuda Yuda Gotrapu Simhama

సింహాసనాసీనుడా - యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు దేవ తనయా
దేవ గొఱ్ఱెపిల్లవు - నీవే స్తుతులకు యోగ్యుడవు
ఆ... ఆ... ఆ... హల్లెలూయా - మా మహారాజా
హోసన్న హోసన్న హల్లెలూయా - శ్రీ యేసురాజా ఆ.. ఆ.. ఆ..

 1. ప్రభువుల ప్రభువు - రాజుల రాజు - ప్రతివాని మోకాలు వొంగవలె ఆ.. ఆ.. ఆ..
ప్రభు యేసుక్రీస్తే - దేవుడని - ప్రతివాని నాలుక ఒప్పవలె

 2. సర్వాధికారి - సత్యస్వరూపి - సర్వైశ్వర్యము - సృష్టికర్తవే ఆ.. ఆ.. ఆ..
     మహిమా ప్రభావము - ఇహపరములలో - ప్రభువా పొంద - అర్హుడవు

3. అల్ఫా ఓమేగ - ఆమెన్‌ అనువాడ - యుగయుగములకు - మహరాజా ఆ.. ఆ.. ఆ..
నామములన్నిట ఉన్నత నామం - ప్రణుతింతు నిన్నె - కృపామయా

71. Sagilapadi Mrokkedamu Satyamutho Aathmatho

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆ

1. మోషేకంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్‌
వేషధారులను ద్వేషించున్‌ ||2|| ఆశతొ మ్రొక్కెదము

2. అహరోనుకంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధానయాజకుడు ||2|| అందరము మ్రొక్కెదము

3. ఆలయముకన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగ తానేయుండెన్‌
ఆలయము మీరేయనెను ||2|| ఎల్లకాలము మ్రొక్కెదము

 4. యోనాకంటే శ్రేష్ఠుడు ప్రాణ దానముగా తనువర్పించెన్‌
మానవులను విమోచించెన్‌ ||2|| ఘనపరచి మ్రొక్కెదము

 5. సొలొమోనుకన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు ||2|| పదిలముగ మ్రొక్కెదము

 6. రాజులకంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్‌
రారాజుగ త్వరలో వచ్చున్‌ ||2|| రయముగను మ్రొక్కెదము

 7. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు
హల్లెలూయా పాత్రుండు ||2|| అనుదినము మ్రొక్కెదము


70. Sarva Krupanidhiyagu Prabhuva

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము

1. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ధముగ జీవించుటకై - పాపిన నను కరుణించితివి

2. అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
నాధుని అడుగుజాడలలో - నడచుటకు నను పిలిచితివి

3. మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి - మరణ భయములను తీర్చితివి

4. భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండి నన్ను - ప్రేమించి క్రయధనమిచ్చితివి

5. ఎవరు పాడని గీతములు - యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్‌ - యేసుకు నేనేమివ్వగలను

69. Santhosham Naku Santhosham

సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం
అ.ప. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళల నాకు సంతోషమే

1. గంతులు వేసి చప్పట్లు క్టొి దావీదువలె పాడనా
రక్తాన్ని నాకై చిందించి శుద్ధిగ చేసిన
యేసంటే నాకు సంతోషం

2. కష్టాలలోన కరవులలోన పౌలువలె నే పాడనా
నాకై కష్టాలు భరించి మృత్యువును జయించిన
యేసంటే నాకు సంతోషం

3. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా
ఆత్మను నాకై ప్రోక్షించి పరలోకం చేర్చిన
యేసంటే నాకు సంతోషం

68. Sruthi Chesi Ne Padana Stothra Githam

శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం - భజియించి నే పొగడనా స్వామీ
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

1. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవెకదా
జలప్రళయములో నోవాను కాచిన
బలవంతుడవు నీవేకదా నీవెకదా నీవెకదా.... నీవేకదా ||హల్లె||

2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్ఛరితుడవు నీవెకదా
పాపుల కొరకై ప్రాణము ప్టిెన
కరుణామయుడవు నీవే కదా నీవెకదా నీవెకదా... నీవేకదా ||హల్లె||


67. Sri Sabhavaduvaraya Namaha

శ్రీ సభావధూవరా! యనమః - కృపా పూర్ణుడ = భాసురంబైన 
సిం - హాసనంబును మా - కోసము వీడివచ్చితి - తదర్ధమై

1. పధము దప్పిన సంఘ - వధువును వెదుక మోక్ష =  పధమై వేంచేసినావు - తదర్ధమై

  2. నిను గూర్చియె మాకెపుడు - ఘనమోక్షపు బెండ్లి మోద = మును, హిత వత్సరము నాయె; తదర్ధమై

66. Vijaya Samsthutule Niku

విజయ సంస్తుతులే నీకు - ప్రేమస్వరూప
విజయసంస్తుతులు నీకు -జయమే లభించు నీకు
విశ్వమంతట సర్వదీక్ష - ప్రజల వలన నిత్యమయిన
ప్రణుతులు సిద్ధించు నీకు

నేడు మా పనులెల్లను దీవించుము నిండుగా వర్ధిల్లును
చూడ వచ్చిన వారికిని బహు శుభకరంబుగా నుండునటుల
కీడు బాపుచు మేళ్ళను - సమకూడ జేసిన నీకే కీర్తి

ఆటలాడుకొన్నను నీ నామమున - పాటల్‌పాడుకున్ననను
నాటకంబుల్‌ కట్టుకున్నను నాట్యమాడుచు మురియుచున్నను
కూటములను జరుపుకున్నను - నీటుగను నీకేను కీర్తి

పరలోకమునకీర్తి - దేవా నీకే ధరణియందున కీర్తి
నరుల హృదయము లందుకీర్తి - పరమదూతలందుకీర్తి
జరుగు కార్యము లందుకీర్తి - జరుగని పనులందు కీర్తి

65. Lekkinchaleni Stothramul Deva Ellappudu

లెక్కించలేని స్తోత్రముల్‌ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌
ఇంతవరకు నా బ్రతుకులో ||2|| నీవు చేసిన మేళ్లకై

ఆకాశ మహాకాశముల్‌ అందున్న్టి సమూహముల్‌
ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును

భూమిపై కనబడే పైరుల్‌ సుడిగాలియు మంచును
అడవిలో నివసించేవన్నీ దేవా నిన్నే కీర్తించును

నీటిలోనివసించు ప్రాణుల్‌ ఆ మత్స్య మహామత్స్యముల్‌
జీవము కలిగినవన్నీ దేవా నిన్నే కీర్తించును

Tuesday, 26 July 2016

64. Ruchi Chuchi Erigithini Yehova Uthamudaniyu

రుచిచూచి ఎరిగితిని యెహొవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని

గొప్ప దేవుడవు నీవె స్తుతులకు పాత్రుడ నీవె
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవె

మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనస్సార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్‌

మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు

నా జీవితమంతయును యెహొవాను స్తుతియించెదెను
నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్‌

63. Randi Yehovanu Gurchi Uthsaha Ganamu

రండి యెహొవాను గూర్చి
ఉత్సాహగానము చేయుదము
ఆయనే మన పోషకుడు
నమ్మదగిన దేవుడని

కష్టనష్టములెన్నున్నా
పొంగు సాగరాలెదురైనా
ఆయనే మన ఆశ్రయం
ఇరుకులో ఇబ్బందులలో

విరిగి నలిగిన హృదయముతో
దేవదేవుని సన్నిధిలో
అనిశము ప్రార్ధించిన
కలుగు ఈవులు మనకెన్నో

త్రోవ తప్పిన వారలను
చేరదీసే నాధుడని
నీతి సూర్యుండాయనే యని
నిత్యము స్తుతి చేయుదము

62. Randi Yuthsahinchi padudamu Rakshanadurgamu Mana Prabhuve

రండి యుత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే

రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోషగానము చేయుదము

మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యముగల రాజు
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరము లాయనవే

సముద్రము సృష్ఠించే నాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్
ఆయన దైవము పాలితుల
మానయ మేపెడి గొర్రెలము

ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన
నయ్యవి మనకెంతొ మేలగును

తండ్రి కుమార శుద్ధాత్మకును
దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు
అయినట్లు యుగములనౌను ఆమేన్

61. Yogyudavo Yogyudavo

యోగ్యుడవో - యోగ్యుడవో
యేసుప్రభో నీవే యోగ్యుడవో
మరణము గెల్చిన యోధుడవో
మా జీవితముల పూజ్యుడవో

సృష్టికర్తవు నిర్మాణకుడవు
జీవనదాత జీవించువాడా
శిరమును వంచి కరములు జోడించి
స్తుతియించెద నిన్ను యేసుప్రభో

గొఱ్ఱెపిల్లవై యాగమైతివి
సిలువయందే పాపమైతివి
శిరమును వంచి కరములు జోడించి
సేవించెద నిన్ను యేసుప్రభో

స్నేహితుడవై నీవిల కోరితివి
విడువక నన్ను ఆదుకొంటివి
శిరమును వంచి కరములు జోడించి
భజియించెద నిన్ను యేసుప్రభో

60. Yese Goppa Devudu Mana Yese Sakthimanthudu

యేసే గొప్ప దేవుడు మన శక్తిమంతుడు
యేసే ప్రేమపూర్ణుడు
యుగయుగములు స్తుతిపాత్రుడు
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్

మహా శ్రమలలో - వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలిచిన
యోబు వలెనే జీవించెదను
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘశాంతుడు మనప్రభు యేసే
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్

ప్రార్ధన శక్తితో - ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయదుర్గము మనప్రభు యేసే
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్

జీవితమంతా - ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలెనే జీవించెదను
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతిసూర్యుడు మనప్రభు యేసే
స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్

59. Yesuni Stutiyinchu varu Nitya Jeevam

యేసుని స్తుతియించువారు - నిత్య జీవము నొందెదరు
ఆనందముతో దినదినము - సంతోషముగ నుందురు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు
చేయి విడువక తనతో కూడ - యేసే నడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

చీకు చింతలు కలిగినను - చెరలు దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

నడి సంద్రములో పయనించినా - నట్లడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా

58. Yesu Yesu Ma Manchi Deva Ninnu

యేసు యేసు మా మంచిదేవా నిన్ను మేము కీర్తించెదము
యేసు యేసు మా గొప్ప దేవా నిన్ను మేము ఘనపరచెదము
కరుణామయుడా కనికర హృదయ పరలోక రాజ స్తోత్రములు
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైనదేవా స్తోత్రములు

అలలతొ చెలరేగిన సంద్రామునందు
జీవిత దోనెను నడిపే నావికుడ
కల్లోల కడలిని నిమ్మళపరచే నీనోటి మాట అద్భుతము
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తుతి స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా

మరణమా నీముల్ల్లు విరిచె యేసు సిలువలో జయశాలి
యజ్ఞాదుడు సమాధి నీ విజయం గురుతులేమాయెన్‌
మృత్యుంజయుడేసు నిను గెలిచి లేచెన్‌ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తుతి స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా

రానుండె రారాజు మేఘముపైనె
సిద్ధముగా నుండుము సంఘ వధువ ప్రధానదూత బూర మ్రోగున్‌ వేగ హర్షించి కేకలు వేసెదము
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తుతి స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా

57. Yesu Prabhun Stutinchuta Entho Entho Manchidi

యేసుప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది

మహోన్నతుడా నీ నామమును
స్తుతించుటయే బహుమంచిది
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

విలువైన రక్తము సిలువలో కార్చి
కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

ఎంతో గొప్ప రక్షణనిచ్చి
వింతైన జనముగా మము జేసెను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

మా శైలము మా కేడెము
మా కోటయు మా ప్రభువే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

ఉన్నత దుర్గము రక్షణ శృంగము
రక్షించువాడు మన దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

అతిసుందరుడు అందరిలోన
అతికాంక్షనీయుడు అతి ప్రియుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

రాత్రింబవళ్లు వేనోళ్లతోను
స్తుతించుటయే బహుమంచిది
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

56. Yesu Ni Thalape Naku Entho Haayi

యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
ప్రభు యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
యేసు నిను తలంపగానే హృదయ
మానందముతో నిండున్
నీ సముఖమున ముఖము జూచుచు
వాసము చేసినపుడెట్లుండునో

నీ నామస్వర మాధుర్యంబు
నా నాలుక పాడంజాలదు
మానసము వర్ణింపనేరదు
జ్ఞానశక్తి కనుగొనజాలదు

విరిగిన మతి కాశవీవె
వినయుల కానందమీవె
దొరలిపడిన నెత్తుదు నీవె
దొరుకువాడ నీవె వెదకిన

నిన్ను గల్గిన వారిమాట
యెన్నలేవు జిహ్వయు కలమున్
నిన్ను ప్రేమతో జూచువారికి
నీదు ప్రేమ యేమియో తెలియును

యేసు మా సంతోషము నీవె
ఈవె మా బహుమతివై యుందువు
భాసురంబుగ మా మహిమవై
బరగుచుండుము నిత్యము వరకు

55. Yesu Nama Smarana Cheyandi Priyulara

యేసునామ స్మరణ చేయండి ప్రియులార
క్రీస్తు యేసునామ స్మరణ చేయండి
యేసునామ స్మరణవలన ఎట్టికష్టమైన తొలగును
యేసునామ స్మరణవలన ఎట్టిసౌఖ్యమైనా కలుగును
యేసునామ స్మరణవలన ఎట్టికష్టమైన తొలగును
యేసునామ స్మరణవలన ఏదిపోదు? ఏదిరాదు?

యేసునామ స్మరణమానకుడి ప్రియులార
క్రీస్తు యేసునామ స్మరణ మానకుడి
యేసునామ స్మరణవలన ఎట్టి పాపమైన పోవును
యేసునామ స్మరణవలన ఎట్టి వ్యాధియైన కుదురును
యేసునామ స్మరణవలన ఎట్టి కొదువయైన గడచును
యేసునామ స్మరణవలన ఎట్టి ఆమెకైన శిశువులు
యేసునామ స్మరణవలన ఎట్టి భూతమైన వదలును

క్రీస్తునామ స్మరణచేయండి ప్రియులార
యేసుక్రీస్తు నామ స్మరణచేయండి
క్రీస్తునామ స్మరణవలన వాస్తవంబు బైలుపడును
క్రీస్తునామ స్మరణవలన స్వస్థస్థితులు దొరుకుచుండును
క్రీస్తునామ స్మరణవలన ఆస్థి పరమునందు నుండును
క్రీస్తునామ స్మరణవలన క్రియకు అన్నియు లభ్యమగును

యేసుక్రీస్తు స్మరణ మానకుడి ప్రియులార
క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి
యేసుక్రీస్తు స్మరణవలన ఎట్టి దుఃఖమైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన ఎట్టి చింతయైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన ఏ నిరాశయైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన ఎట్టి అజ్ఞానమును ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన ఎట్టి భీతియైన ఉండదు

యేసునే ధ్యానించుచుండండి ఏకాంతమందున
యేసునే ధ్యానించుచుండండి
యేసుని ధ్యానించుటచే ఏమియును సమయంబుపోదు
యేసుని ధ్యానించుటచే ఏమియును విశ్రాంతిపోదు
యేసుని ధ్యానించుటచే ఏమియును పనివెనుకబడదు
యేసుని ధ్యానించుటచే ఏమియును సుఖంబు తగ్గదు
యేసుని ధ్యానించుటచే ఏమియును ఖర్చైపోదు

ఇట్టి ధ్యానము చేయుచుండిన మీలోని భక్తి
గట్టి పడును కాల క్రమమున
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి అప్పులైన తీరును
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి వ్యాజ్యమైన గెలుచును
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి నిందయైన అణగును
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి కలహమైన ఆగును
ఇట్టి ధ్యానమువలన మీకు వట్టి మాట వట్టి దగును

మనుష్య కుమారుండు మనుష్యుడే ఆ పద్ధతిన
దేవుని కుమారుడు కూడ దేవుండే
దేవకుమారుని బట్టి దేవుని బిడ్డలము మనము
వాగ్ధానమును బట్టి దేవుని వారసుల మైయున్నాము
యేసుప్రభువు ప్రవక్త యనిన ఏమిచెప్పిన నమ్మవలెను
ఏమతస్థులైన నమ్మిన యేసు మేలు చేయుచుండును
యేసుదేవుడు మన నరుండు ఎంతగానో మురియవలెను
బైబిలునందున్న క్రీస్తుని పావన చరిత్ర చదువుడి
యేసు మనలో నున్నాడు యేసులో మనమున్నాము
యేసునకు మనమే మనకు యేసేయుండును ఏమితక్కువ

54. Yehovanu Ganamu Chesedamu Ekamuga

యెహోవాను గానము చేసెదము ఏకముగా
మనకు రక్షకుడాయెను ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు

యుద్ధశూరుడెహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా

ఫరో రధముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
ఎర్రసముద్రములోన - ముంచివేసె నెహోవా

నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నీపై లేచు వారిని

దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నాకత్తి దూసెదను - అని శత్రువనుకొనెను

వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమైన పూజ్యుడా - నీవిం వాడెవడు

ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా 
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి

53. Yehova Satya Deva Ni Sarane Korithin

యెహోవా సత్యదేవా - నీ శరణే కోరితిన్
నీవెన్నడు నను విడనాడవని
నా రక్షణకర్త నీవేయని

నీవే ఆశ్రయ దుర్గమై - నా కోటవై నాధుడవై
మమ్ము కదలింప నీయవని - మాకు సహాయం నీవని

ఆకాశం కంటే నా ప్రభు - అతి ఉన్నతుడౌ నీవేయని
అన్ని కాలములలో నీకృప - నాకు అమూల్యమైనదని

నా యీజీవిత మంతయు - నిన్నే నేను నుతియింప
నన్ను నీవాడుకొందువని - నాకు సహాయం నీవని

52. Yuda Stuthi Gotrapu Simhama Yesayya Na

యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా
నీవేకదా నా ఆరాధనా - ఆరాధనా - స్తుతి ఆరాధనా

నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది

నీ నీతి కిరణాలకై నా దిక్కు దెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రధమ ఫలముగ పక్వపరచి నీకు
అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది

నీ వారసత్వముకై నా జయము కొరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది - అసాధ్యమైనది ఏమున్నది

51. Mruthulanu sajeevuluga leni vatini unnatugane

మృతులను సజీవులుగా లేనివాటిని ఉన్నట్టుగా
చేయుదేవుడా పిలుచుదేవుడా
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము 

ఆధారం లేనప్పుడు ఆధారివి నీవై
అబ్రహాముకు వారసునిగా ఇస్సాకును ఇచ్చితివి 
వాగ్ధానం చేయువాడవు నమ్మదగినవాడవు  
నమ్మదగిన వాడవు నా దేవుడవు
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము 

ఏ సహాయం లేనప్పుడు ఆ సహాయం నీవై
ఏలియాకు కాకుల ద్వారా ఆహారం నిచ్చితివే 
నా సాయం నీవై నా తోడుగ నిలిచితివి 
నా తోడువు నీవే నా దేవుడవు
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము 

Monday, 25 July 2016

50. Ma Sarvanidhi Nivayya

మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా

మా రక్షకుడవు మా స్నేహితుడవు
పరిశుద్ధుడవు మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా

నీవే మార్గము నీవే సత్యము
నీవే జీవము మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాధ
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా

విరిగితివయ్యా నలిగితివయ్యా
కలువరిలో ఓ మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా

49. Mahima Nike Prabhu Ghanata Nike Prabhu

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు
స్తుతులు చెల్లింతును త్రియేక దేవుని
నా త్రియేక దేవునికే

సిలువలో నా కొరకు యేసు రక్తము కార్చితివే
ప్రాణము పెట్టితివే యేసు ప్రేమను చూపితివే
నీ ప్రేమను చూపితివే

నా అతిక్రమము బట్టి యేసు గాయాలు పొందితివా
నీ గాయాలే నా స్వస్థత కేంద్రాలు నాకు స్వస్థత నీవైతివే
నన్ను స్వస్థపరచు యెహోవావే

ఆత్మతో నన్ను నింపు యేసు అగ్నితో నన్ను నింపు నీ
ఆత్మల పట్టుటకై (యేసు) నీ అభిషేకము నాకిమ్ము
అగ్ని అభిషేకము నా కిమ్ము

48. Mahaghanudu Mahonnathudu

మహాఘనుడు మహోన్నతుడు
సర్వశక్తుడు సర్వోన్నతుడు

యేసే నీకు ఆశ్రయము
ఆయన నీకు కోటయగును
దేవుడని నీవు నమ్ముకొనుము
ఆయన నీడలో విశ్రమించుము

వేటకాని ఉరి నుండి విడిపించును
వినాశనం రాకుండ నిన్ను కాయును
తన రెక్కలతో నిన్ను కప్పును
కేడెము మోయుచు నిన్ను కాయును

వెయ్యిమంది నీప్రక్క పడియుండగా
పదివేలు కుడిప్రక్క కూలి యుండగా
అపాయము నీకు సంభవింపదు
ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును

నీదు పాదములకు రాయి తగలదు
దూతలు చేతులతో ఎత్తుకొందురు
యేసు నామమెరిగి నీవు నిలువుము
యేసే నీకు ఘనత నిచ్చును

47. Manchi Devudu Na Yesayya

మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా (2)
మహిమా ఘనతా ప్రభావము నీకే (2)

కృపల వెంట కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన (2)
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా (2)         ||మహిమా||

మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి (2)
మహిమలో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి (2)         ||మహిమా||

జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి (2)
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను (2)  ||మహిమా||

46. Mangala Stothrapanalu Mahaneeya Devuniki

మంగళ స్తోత్రార్పణలు - మహనీయ దేవునికి
అంగున్న లేకున్న - అంతము లేని స్తుతులు మంగళార్చ

ఎట్టివారినైన - ఏ స్థలము నందైన
పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ

యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య
వాసంబు జేసిన పరమ దేవునికి మంగళార్చ

నరులకు తండ్రిగా - వరరక్ష పుత్రడుగా
పరిశుద్ధాత్ముండుగా బైలైన దేవునికి మంగళార్చ

45. Bakthulara Smariyinchedamu Prabhu Chesina

భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిని
అడిగి ఊహించువాికన్న మరి సర్వము చక్కగ జేసె

శ్రీ యేసే మన శిరస్సైయుండి మహా బలశూరుడు
సర్వము నిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు

గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించె
శ్రమలలో మనకు తోడై యుండి బయలుపరచె తన జయమున్

జీవనదిని ప్రవహింపజేసె సకల స్థలంబులయందు
లెక్కకు మించిన ఆత్మల తెచ్చె ప్రభువే స్తోత్రార్హుండు

అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చె

మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్యము జూపె

ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే
మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశయమదియే

కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై
గనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు

44. Prabhuva Nin Keerthinthun

ప్రభువా నిన్ కీర్తింతున్
యేసయ్యా నిన్ను ఆరాధింతును
నా జీవితకాలమంతా నీవు చేసిన మేలులకు

మరణ బాధలనుండి - నన్ను విడిపించినావా
మరతునా నీ ప్రేమ ఇలలో - మహిమగల రాజా
మహోన్నతుడా యేసు - మహిమ
నీకేనయ్యా మహిమ నీకేనయ్య

ఎండిన ఎముకలకు - జీవము నిచ్చినావా
గుండె చెదరిన నన్ను - బాగుచేసినావా
జీవాధిపతి యేసు జిహ్వాఫలమందుకో

జీవకిరీటమున్ - నాకు ఇచ్చుటకున్
ముండ్ల కిరీటమున్ - నీవు ధరియించినావా
ఆత్మా స్వరూపి యేసూ
ఆరాధనలందుకో ఆరాధనలందుకో

43. Prabhu Namam Na Asrayame

ప్రభు నామం నా ఆశ్రయమే
ఆయనను స్తుతించెదను
ప్రభు మహిమ నా జీవితమే
ఆయనను వెంబడించెదను

యెహోవా షాలోమ్ - శాంతి నిచ్చును
శాంతిదాత నా శాంతి దాత

యెహోవా యీరే - అన్నిని చూచుకొనును
కొదువ లేదు నాకు కొదువ లేదు

యెహోవా నిస్సియే - ఎల్లప్పుడు జయమిచ్చును
జయమున్నది నాకు జయమున్నది

యెహోవా రోహీ - నాదు కాపరి
మంచి కాపరి నా గొప్ప కాపరి

యెహోవా రాఫా - స్వస్థత నిచ్చును
భయములేదు నాకు భయములేదు

యెహోవా షమ్మా - నాకై ఉన్న దేవుడు
ఉన్నవాడు నాతో ఉండువాడు


42. Parisudha Parisudha Parisudha Prabhuva

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా

పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా

పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా

పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా

జనక కుమారాత్మ – లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా

41. Padivelalo Athi Sundaruda

పదివేలలో అతిసుందరుడా
మనోహరుడా మహిమోన్నతుడా (2)
నీ నామం అతి మధురం
నీ త్యాగం మహానీయం (2)

తల్లిదండ్రుల కన్నను
బంధు మిత్రుల కన్నను (2)
ప్రేమించి నాకై నిలచే
స్నేహితుడా ప్రాణ నాథుడా (2)        ||పదివేలలో||

నీ కొరకే యేసు నీ కొరకే (3)
నా కరములెత్తెదను
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెద నీ కొరకే (2)
పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)
నను యేసు పాదము చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము                      ||నీ కొరకే||

40. Ni Padam Mrokkedan Nithyamu Stutinchi Ninnu Padi Keerthinchedan

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసు కృపా వరమే (2)
వెదకి నన్ను కనుగొంటివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2)      ||నీ పాదం||

నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వము కృపతోను (2)
నింపి నిత్యము నడిపితివి (2)
నూతన షాలేము చేర్చెదవు (2)      ||నీ పాదం||

ఇరుకు నందు పిలచితివి
నాకు సహాయము చేసితివి (2)
చెడి ఎక్కడ తిరుగకుండ (2)
చేరవచ్చి నన్ను ఆదుకొంటివి (2)      ||నీ పాదం||

నిత్యముగ నీ సన్నిధి
నాకు ఇచ్చును విశ్రాంతిని (2)
దుడ్డు కర్ర నీ దండమును (2)
నిజముగ నన్ను ఆదరించును (2)      ||నీ పాదం||

ఫలించు చెట్టు నీవు నిలచు
తీగగా నేను వ్యాపించుటకై (2)
కొమ్మ నరికి కలుపు తీసి (2)
కాపాడి శుద్దీకరించితివి (2)      ||నీ పాదం||

పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై (2)
శీఘ్రముగ చేర్చెదవు (2)
సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2)      ||నీ పాదం||

39. Nithyamu Stutinchina Ni Runamu Tirchalenu

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2)

రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా దేవాది దేవుడవు (2)||నిత్యము||

అద్వితీయ దేవుడా
ఆది అంతమునై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు (2)                  ||రాజా||

జీవమైన దేవుడ
జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి (2)                    ||రాజా||

మార్పులేని డ
మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా (2)                   ||రాజా||

38. Na Stutula Paina Nivasinchuvada Na Antharangikuda Yesayya

నా స్తుతుల పైన నివసించువాడా
నా అంతరంగికుడా యేసయ్యా (2)
నీవు నా పక్షమై యున్నావు గనుకే
జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)

నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే
అది నా ఊహకే వింతైనది (2)
ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి
ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2)        ||నా ||

ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా
నీతో మధురమైన ఫలములీయనా (2)
ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే
విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా ||

నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి
అవి నాకెంతో ప్రియమైనవి (2)
నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి
పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2)    ||నా ||

37. Na Stuthi Patruda Na Yesayya

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)

నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)
నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి||

నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)
నీ కృపయే నా జీవన ఆధారము (3)        ||నా స్తుతి||

నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)    ||నా స్తుతి||

36. Na Pranama Yehovane Nivu Sannuthinchi

నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము
నా నాధుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు
యేసయ్యా నా యేసయ్యా
నినువీడి క్షణమైన నేను - బ్రతుకలేను స్వామి IIనాII

యేసులేని జీవితం జీవితమే కాదయ్య
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్య
నిను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా IIనాII

మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు
మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్
య ఆ ప్రేమతోనే నిరతము నన్ను నడుపుము యేసయ్య
నినువీడి క్షణమైన నేను - బ్రతుకలేను స్వామి IIనాII

35. Na Pranama Yehovanu Sannuthinchuma

నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా

సంకటములన్ని తను సవరించి - సమాధి నుండి విమోచించి
చల్లని దయ మన కిరిటముగ నుంచి ఆ.....
సతతము మనలను కాచెడి కర్తను ||నా||

దోషములన్ని తొలగించువాడు - పాపములన్ని క్షమియించువాడు
కోపము చూపక శాపము బాపిన ఆ...
కాపరియై మనల కాచెడి కర్తను ||నా||

నిత్యము తాను ప్రేమించువాడు - సత్యము జీవము మార్గము తానై
అధికమైన మన దోషంబులకు ఆ....
అసువులర్పించిన ఆ దేవ సుతునికి ||నా||

34. Na notan Krotha Pata Na Yesu ichenu

నా నోటన్ క్రొత్త పాట - నా యేసు ఇచ్చెను
ఆనందించెదము ఆయననే పాడెదన్
జీవిత కాలమంత హల్లెలూయా ||2||

పాపపు బురద నుండి లేవనెత్తెను
జీవమార్గమున నన్ను నిలువ బెట్టెను             ||ఆనందిం||

తల్లిదండ్రి బంధు మిత్రుల్ దూరమాయెనే
నిందలు భరించి ఆయన మహిమన్ చాటెదన్||ఆనందిం||

వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను
కష్టములన్ని తొలగించి ఆదరించెను              ||ఆనందిం||

ఇహలోక శ్రమలు నన్నేమి చేయును
పరలోక జీవితమునే వాంఛించెదన్               ||ఆనందిం||

33. Devuniki stothram ganamu cheyutaye manchidi

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని              

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని     

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని        

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని     

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి     

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని    

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును  

గుర్రముల నరులందలి బలము నానందించడు
కృపకు వేడు వారిలో సంతసించువాడని     

యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని 

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును 

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును 

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని     

32. Devuni Stutiyinchudi Ellappudu Devuni Stutiyinchudi

దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని||

ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||

ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2)      ||ఎల్లప్పుడు||

ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2)  ||ఎల్లప్పుడు||

బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2)   ||ఎల్లప్పుడు||

సన్నని తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2)    ||ఎల్లప్పుడు||

తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2)     ||ఎల్లప్పుడు||

పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2)           ||ఎల్లప్పుడు||

మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2)       ||ఎల్లప్పుడు||

సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ…  (2)    ||ఎల్లప్పుడు|| 

31. Deva Ni Namam Balamainadi Ni Namam

దేవా నీ నామం
బలమైనది నీ నామం (2)
స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం (2)
అన్నిటి కన్న పై నామం
యేసయ్యా నీ నామం
యేసయ్యా నా యేసయ్యా (4)

ఆశ్రయ దుర్గము నీ నామం
నా కొండ నా కోట (2)
స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం (2)
అన్నిటి కన్న పై నామం
యేసయ్యా నీ నామం
యేసయ్యా నా యేసయ్యా (4)

30. Deva Thandri Niku dina dina stutulu

దేవా తండ్రీ నీకు - దినదిన స్తుతులు
నా విన్నపము విన్న - నాధా సంస్తుతులు

అవిత్రాత్మల దర్శన - మాపియున్నావు
ఎపుడైనా అవి నా - కేసి రానీయవు

చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు
గడ్డు పలుకుల నోళ్ళు - గ్టి యున్నావు

చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా
కడకు రానీయవు - కదలనీయవు

పాపంబులను దూర - పరచియున్నావు
పాపంబులను గెల్చు - బలమిచ్చినావు

పాపఫలితములెల్ల - పారదోలితివి
శాపసాధనములు - ఆపి వేసితివి

దురిత నైజపు వేరు - పెరికియున్నావు
పరిశుద్ధ నైజ సం-పద యిచ్చినావు

ప్రతివ్యాధిన్ స్వస్థ - పరచియున్నావు
మతికి ఆత్మకును నెమ్మది యిచ్చినావు

అన్న వస్త్రాదుల - కాధార మీవె
అన్ని చిక్కులలో స - హాయుండ వీవే

ననుగావ గల దూత - లను నుంచినావు
నినునమ్ము విశ్వాస - మును నిచ్చినావు

సైతాను క్రియలకు సర్వనాశనము
నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము

సాతాను ఆటలిక - సాగనియ్యవు
పాతాళాగ్ని కతని పంపి వేసెదవు

అన్ని ప్రార్ధనలు నీ - వాలించి యున్నావు
అన్నిలో మహిమ అందుకొన్నావు

సర్వంబులో నీవు - సర్వమై యున్నావు
నిర్వహించితివి నా - నిఖిల కార్యములు

హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ తండ్రీ
కలకాలమున్న్టి హల్లెలూయ తండ్రీ!

జనక కుమారాత్మ - లను త్రైకుడొందు
ఘనత కీర్తి మహిమ - చనువు నాయందు

29. Deva Samsthuthi Cheyave Manasa

దేవసంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు
యెహోవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా
జీవమా యెహోవా దేవుని - పావన నామము
నుతింపుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా

జీవమా యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు
నీవు జేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే

చావుగోతి నుండి నిన్ను - లేవనెత్తిన దయను కృపను
జీవకిరీటముగ చేయును - నీ శిరసు మీద
జీవకిరీటముగ వేయును - ఆ కారణముచే

యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త
యౌవనంబై వలెయునట్గుగ - మేలిచ్చి నీదు
భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణముచే

ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమీయున్
విభుడు మార్గము తెలిపె మోషేకు - తన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే

అత్యధిక ప్రేమాస్వరూపి - యైన దీర్ఘశాంతపరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీపై నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే

పామరులని - ప్రత్యపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు
భూమి కన్న నాకసంబున్న - యేత్తుండు దైవ
ప్రేమ భక్త జనుల యందున - ఆ కారణముచే

పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్
మనకునంత యెడము కలుగజేసి యున్నాడు మన
పాపములను – నెడముగానె చేసియున్నాడు ఆ కారణముచే

కొడుకులపై తండ్రిజాలి - పడువిధముగా భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే

మనము నిర్మితమైన రీతి - తనకు తెలిసియున్న
సంగతి మనము మంటి వారమంచును - జ్ఞాపకముచేసి
కొనుచు స్మరణ చేయు చుండును - ఆ కారణముచే

వూసిగాలి వీవనెగిరి- పోయి బసకు దెలియని వాన
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు
తృణ ప్రాయము శ్రీ దేవకృప మెండు - ఆ కారణముచే

పరమదేవ నిబంధనాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు
నిరతమును కృప నిలిచి యుండును యెహోవా
నీతి తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే

దేవుడాకాశమును గద్దె - స్థిరపరచుకొని సర్వమేలున్
దేవదూత లారా దైవాజ్ఞ - విని వాక్యము నడుపు
దిట్టమైన శూరులారా - స్తోత్రంబు చేయుడి

దేవ సైన్యములారా ఆయన - దివ్య చిత్తము
నడుపు నట్టి సేవ కావళులారా దేవుని - పరిపాలన
చోట్ల - లో వసించు కార్యము లారా - వందనము చేయుడి

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...