Wednesday, 20 July 2016

17. Entho Sundarudamma Thanu

ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2)                         ||ఎంతో||

ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2)         ||ఎంతో||

కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2)       ||ఎంతో||

పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||

మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2)||ఎంతో||

అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2)||ఎంతో||


9 comments:

Preminthunu Prabhuva Ninnu Lyrics | ప్రేమింతును ప్రభువా నిన్ను | Telugu Christian Song Lyrics # 609

ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...