About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons in Telugu and English. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.

Wednesday, 20 July 2016

20. Krupamayuda nilona nivasimpa jesinanduna

కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…

ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2)         ||కృపా||

చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2)       ||కృపా||

నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2)      ||కృపా||

ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను (2)      ||కృపా||

No comments:

Post a Comment

Netho Unte Jeevitham | Telugu Christian Song # 595

నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము ఓ…. నువ్వే నా జీవాధారము (2) న...