Wednesday, 20 July 2016

Ayane Na Sangithamu Balamyna Kotayunu | Telugu Christian Song #8

ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే||

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)   ||ఆయనే||

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే||

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||

1 comment:

Preminthunu Prabhuva Ninnu Lyrics | ప్రేమింతును ప్రభువా నిన్ను | Telugu Christian Song Lyrics # 609

ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...