Wednesday, 4 April 2018

484. Yesuni Rakadalo Ayana Mukhamu Chudaga

యేసుని రాకడలో
ఆయన ముఖం చూడగా
హా! ఎంతో ఆనందమే

అవనిలో జరుగు క్రియలన్నీ
హా! ఎంతో సత్యమేగా
వేదవాక్యం నెరువేరుచుండ
ఇక మీకు చింతయే లేదా

లోకజ్ఞానం ఇల పెరుగుచుండె
అనుదినం జనములలో
ఆది ప్రేమ చల్లారెనుగా
ఇవే రాకడ సూచనల్గా

పలుశ్రమలు ఇక సహించి
సేవను పూర్తి చేసి
పరుగును తుదముట్టించుము
నిత్య బహుమతి నొందుటకై

విన్నవాక్యం నీలో ఫలింపజేసి  
వేగమే సిద్ధపడుము
ప్రాణాత్మ దేహం సమర్పించుము
ప్రార్ధనతో మేల్కొనుము

1 comment:

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...