Wednesday, 4 April 2018

480. Ni Raka Samipyamanchu Nenipude Gurthinchi Yunti

నీ రాక సామీప్యంచు
నేనిపుడే గుర్తించి యుంటిన్
నీ రాక కొరకు నా జీవితమును
ఆయత్త పరచుము నా యేసుప్రభో

నీ రాక నిజమయ్య ప్రభువా
నేడో రేపో మరి ఇంకెపుడో
ఏ వేళనైనా ఆ మర్మ మెరిగి
మది తలచ కృపనిమ్ము యేసుప్రభో

నీ భీతి లేశంబు లేక
ఎన్నెన్నో పాపాలు చేయ
వెనుకాడ కుంటిన్ మితిమీరిపోతిన్
నను నిలిపి స్థిరపరచుము యేసుప్రభో

నా దీపమున నూనె లేదు
నా బ్రతుకున వెలుగేమి లేదు
శుద్ధాత్మ నూనె సద్భక్తి కాంతి
నా కొసగి వెలుగించుము యేసుప్రభో

కడబూర మ్రోగేటి వేళ
మేఘాలు నినుమోయు వేళ
పరలోక వరుడ ఓ గొఱ్ఱెపిల్లా
నీ వద్దకు నన్నెత్తుము యేసుప్రభో

విశ్వాస సంఘంబులోన
నీ జీవ గ్రంధంబులోన
నే చేర్చబడెద ముద్రంపబడెద
రక్తముతో ముద్రించుము యేసుప్రభో

నిత్యుండ సర్వాధికారి
నీ కొరకు కనిపెట్టుచుండ
మోకాళ్ళు వంచి ప్రార్ధించుచుండ
నీ ఆత్మను నా కొసగుము యేసుప్రభో

సర్వాంగ కవచము దాల్చి
వాక్యంబను ఖడ్గంబు బూని
సైతాను తోడ పోరాడుచుండ
బలమిమ్ము జయమిమ్ము యేసుప్రభో

నీ తీర్పు దినమందు రాజా
నీతిమంతుల సంఘమందు
నేనుండగల్గ కొనియాడగల్గ
నీతి వస్త్రము నిమ్ము యేసుప్రభో

నేనన్ని సమయంబులందు
నేనన్ని కాలంబులందు
నీతోడ కలసి జీవించగల్గ
అనుభవము కలిగించుము యేసుప్రభో

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...