Wednesday, 4 April 2018

485. Rakada Samayamulo Kadabura Sabdamtho

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా 
యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా
లోక ఆశలపై విజయం నీకుందా
ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా
యేసుని ఆశించే దీన మనస్సుందా
దినమంతా దేవుని సన్నిధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా
యేసునాథునితో సహవాసం నీకుందా
శ్రమలోన సహనం నీకుందా
స్తుతియించే నాలుక నీకుందా
ఆత్మలకొరకైన భారం నీకుందా
నీ పాత రోత జీవితము
నీ పాప హృదయం మారిందా
నూతన హృదయంలో ఆరాధన నీకుందా
అన్నీటికన్న మిన్నగా
కన్నీటి ప్రార్థన నీకుందా
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...