Monday 22 January 2018

317. Ekantha Sthalamu Korumu Devuni Prardhimpa

ఏకాంత స్థలము కోరుము - దేవుని ప్రార్ధింప - 

ఏకాంత స్థలము చేరుము

ఏకాంత స్థలము చేరి - మోకాళ్ళ మీదవుండి  

లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము

ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రి యెదుట  

దేహము లోకలకవియె - దిగును నిన్ను బాధ పెట్టును

మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము  

ఆటపాటలందు మాట - లాడుటయు నేరంబులగును

చేయబోయి మానుచెడ్డ - చేతలన్ని ఒప్పుకొనుము  

ఈయత్న పాపంబులెల్ల - ఎన్నికలోనికి వచ్చును గాన

పాపక్రియలు అతి దుఃఖముతో - ప్రభుని యెదుట ఒప్పుకొనుము

పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్‌ చేయవలెను 

 

ఎవరిని అల్లరి పెట్టినావో - వారియొద్ద ఒప్పుకొనుము

ఎవరి యొద్ద చెప్పినావో - వారియొద్ద ఒప్పుకొనుము

 

తప్పు వినుట సర్దాయైన - తప్పే తప్పు ఒప్పుకొనుము

తప్పు తట్టు ఆకర్షించు - తగని ఆటపాటలేల

 

కలలో చేసిన తప్పులెల్ల - కర్త యెదుట ఒప్పుకొనుము

తలపులో లేనిది యెట్లు - కలలోనికి వచ్చి యుండును

 

నిన్ను మరల సిలువవేసి - యున్న పాప జీవినయ్యో

నన్ను క్షమియించుమని యన్న - నరులు మారువారు

 

చెడుగుమాని మంచి పనులు - చేయకున్న పాపమగును

పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును

 

దుష్టులు వర్ధిల్లుట చూచి - కష్టము పెట్టుకొనరాదు

కష్టము పెట్టుకొన్న నీవు - దుష్టుడవుగా మారినట్టే

 

భక్తిపరుల శ్రమలు చూచి - భక్తిహీనులనవద్దు

భక్తుల శ్రమలకు ముందు - బహుమానంబు దొరుకగలదు

 

బీదల కాహారము బెట్ట - వెనుకదీసి పొమ్మనరాదు

నీ ధనము నీకే కాదు అది - నిను గని దేహియను వారికిని

 

రోగులను దర్శింప బోవ - రోతయని భావింపవద్దు

బాగుపడు పర్యంతము వరకు - పరిచర్య చేయుట మెప్పు

 

ఎట్టి యబద్దాలు పలుకు - నట్టివారికి నరకమంచు

చిట్టచివరి పుస్తకంబు - చెప్పునది యోచన చేయుము

 

జీవరాసులను బాదుట - జీవహింస నేరమౌను

దేవుడు నిన్నడుగ జెప్పు - తెగువ గలుగ గలదా నీకు

 

ఒకరి వంక మీద ప్టిె ఒకరి ననుట పిరికి తనము

ముఖము యెదుట అడిగి స్నేహ - మును గలిగించుకొనుట మెరుగు

 

గుడిలో కూర్చొని కార్యక్రమము - గుర్తింప కుండుట యశ్రద్ధ

చెడగొట్టి వేయుచుండు - పెడచూపు మనోనిదానము

 

వాక్యాహారము తినని యెడల బలమాత్మకు లభించుటెట్లు

వాక్య గ్రంధములోని దేవుని - పలుకు వినక నడుచుటెట్లు

 

దిన ప్రార్ధనలు చేయని యెడల - దేవుని శ్వాస పొందుటెట్లు

మనసులోని స్వీయ శ్వాస - మలినము పోవుట యెట్లు

 

పరులకు బోధించు సేవ జరుపలేక యున్న యెడల

పరమ భక్తి పరులకైన - బహుమానంబు దొరుకుటెట్లు

 

ప్రభువు కొరకు పనిచేసిన - వారికి తాను బాకీ పడడు

సభ నిమిత్తము చేసినది తన - స్వంతము కన్నట్టె యెంచు

 

చందా నీది కాదు క్రీస్తు - సంఘాభివృద్ధికే చెందు

చందా వేయుము ప్రభువు నీకే - చందా వేయును నీకే అది

 

యేసు నామమందు మనము - యేది చేసిన సఫలమగును

యేసుక్రీస్తు పేరున చేయు - నేదైన దేవునికి మహిమ

 

దేవా! నాకు కనబడుమన్న - దేవ దర్శనమగును నీకు

పావనంబగు రూపము చూచి - బహుగా సంతోషించగలవు

 

దేవా! మాటలాడుమన్న - దేవ వాక్కు వినబడు నీకు

నీవు అడిగిన ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు

 

తప్పు వివరము చెప్పకుండ - తప్పు మన్నించుమని యన్న

తప్పు తప్పుగానే యుండు - తప్పుదారి వృద్ధి పొందు

 

ఏడు తరగతులున్నవి నీది - ఏదో తెలిసికొనుము ఇపుడే

కీడుమాని మంచి చేసిన - క్రింది తరగతి దొరుకునేమో

 

నరుల మీద ప్రేమ క్రీస్తు - వరుని మీద ప్రేమయున్న

పరలోకమున వరుడు ఉన్న - పై తరగతిలోనే చేరెదవు

 

ఆలోచింపకుండ ప్రశ్న - అడుగవద్దు నరుడు కాడు

నీలోని జ్ఞానము వలన - నిరుకు తెలిసిన వడుగ నేల

 

మోటు మాటలాడవద్దు - మోటు పనులు చేయవద్దు

చాటున చేసిన పాపములు - సమయమపుడు బైలు పడును

 

ఉత్తర మాలస్యముగా వచ్చిన - ఉత్తరమసలే రాకయున్న

ఉత్తమ విశ్వాసమును ప్రార్ధన - ఉత్తవియై పోవును విచారము

 

వ్యర్ధమైన ఊహలు మాటలు - పనులు నిన్ను వ్యర్ధ పరచును

తీర్ధము వలెనే పాపము త్రాగిన - తీర్పు శిక్ష సహింపజాలవు

 

ఏ పాపమునకైన పరుల -కే శిక్షయును రాకుండెను

నా పాపములకు శిక్ష కలుగు - నా? యన్న అజ్ఞానమగును

 

ఉదరమునకు శరీరమునకు - ఉండవలెను శుద్ధి గాని

హృదయశుద్ధి చేసి ప్రభుని - యెదుికి రావలెను సుమ్మీ

 

సభకు వేళ రానప్పుడు - ప్రభువే రాత్రి భోజనమిచ్చు

సభకు వేళ వచ్చినప్పుడు - సభతో కలిసి పుచ్చుకొనుము

 

ఎంత ఎన్ని శ్రమలు రాగా - యేసుని బ్టియైన మేలే

సంతోషించుము అంతము వరకు - సహియించిన ధన్యత కలుగు

 

ఇల్లు వాకిలి సామానులు - యెల్ల శుద్ధిగ నుండవలెను

ఉల్లాసముతో దేవుని సన్నిధి - నూరక యుండవలెను విసుగక

 

కోపము ద్వేషము తప్పుడు భావము - కుాలోచనతో కూర్చుండుట

శాపారోపణ తిక్క యిట్టి - సకల దుర్గుణములు ముప్పే

 

దిద్దుకొనుము నిన్ను నీవే - దిద్దగలవు సభను పిదప

దిద్దుకొనని నీ కంటిలో - పెద్ద దూలమందురు కొందరు

 

సన్నిది యందె అన్నియు పరి - ష్కారమగును తెలిసికొనుము

సన్నిధిలో నీవున్న యెడల - సన్నిధి నీలో వుండును సుమ్మీ

 

ప్రార్ధన వాలు రానప్పుడు - ప్రార్ధన ఎక్కువ చేయవలెను

ప్రార్ధన యేసు నామమందు - అర్ధములతో బైలు దేరును

 

ఎక్కువ పనులు వున్ననాడే - ఎక్కువ ప్రార్ధన చేయవలెను

ఎక్కువ పనిలోని సగము - అక్కడపుడే సఫలమగును

 

నీవు నాపనిమీద వెళ్ళుము - నేను నీ పనిమీద వెళ్ళుదు

ఈ విచిత్రమైన మాట - యేసుప్రభువు పలుకుచుండు

 

జనకునికి తెలియదా? అనుచు - మనవి చేయుట మానరాదు

మనవి విందునన్న తండ్రి - మనవి మానివేయుమనెనా?

 

ఎప్పుడు చెడుగు నీలోనికి - ఎగిరి వచ్చునో అప్పుడే

అప్పుడే నరక మార్గమందు - అడుగు బ్టెిన వాడవగుదువు

 

ప్రతిదియు నీ మనస్సులోనే - ప్రార్ధన లోనికి పెట్టవలయు

మతికి జవాబిచ్చును తండ్రి - స్తుతులుగ మార్చు ప్రార్ధన లెల్ల

 

చిన్న పాపమైన ఆత్మ - జీవమున్‌ తగ్గించుచుండు

చిన్ని చిల్లి పాత్ర నీటిన్‌ - చివరకు లేకుండా జేయును

 

దేవదూతలు నీ యొద్ద - కావలిగా నుందురు గాని

కావలి లేదను సైతాను - సేవకులు కూడ ఉందురు

 

నీకు మోక్షము లేదను మాట - నిత్యము వినబడుచునుండు

నాకు క్రీస్తుని బట్టి మోక్షము - లేకుండ పోదనచు నుండుము

 

కష్టాల మేఘముల వెనుక - కలడు నీతి సూర్యుడు క్రీస్తు

దృష్టించు చున్నాడు నిన్ను - దిగులుపడకు దిగులుపడకు

 

నరలోక పాపాలు చూడు - నరకమునకు నిను దిగలాగు

పరలోకము వైపు చూడు - పైకి నిన్ను ఎత్తుచుండు

 

జనక సుతాత్మలకు తగినట్టు - సంస్తుతి చేయలేము మనము 

మనకు చేతనైనంత - మట్టునకు చేయుదము లెండి

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...