Monday 22 January 2018

318. Kummari O Kummari Jagaduthpathi Dari

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా

పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా 
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి

విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి 
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రాన్ నేను – సరిచేసి వాడుమయ్యా

లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే తప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని 
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ నేపట్టితిన్

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...