Tuesday, 27 March 2018

420. Yesuva Nannu Nivu Enthagano Preminchithive

యేసువా నన్ను నీవు
ఎంతగానో ప్రేమించితివే
నీ చల్లని నీడలో ||2||
ఆశ్రయమిచ్చి బ్రోచితివే
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

కలతలలోనే కృంగియుండ
వ్యధలలో నే నలిగియుండ
జీవితముపై ఆశలేక
విసిగి వేసారి నేనుండగా
ఆదరించి జీవితముపై ||2||
ఆశలెన్నో కలిగించితివే
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

కను రెప్పపాటున కాలుజారి
నిను వేడి వేదనతో వగచే ఘడియ
అవమాన భారముతో అల్లాడుచు
అపజయ వేళలలో కుములుచుండ
లేవనెత్తి క్షమియించి ||2||
నా దోషమే మరచితివే
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

అనుదినము నిన్ను వెంబడింతున్
అనుక్షణము నీ ప్రేమన్ ఆస్వాదింతున్
ప్రేమ సుమములతో నిన్ను ఆరాధింతున్
నాహృదిలో నిత్యము నిన్ స్మరియించెదన్
పరమ పధమె కనిపించగ ||2||
తరలివత్తున్ నీ సన్నిధికిన్
యేసయ్య నా ప్రభు యేసయ్య నా సర్వమా
యేసయ్య నా విభుడ యేసయ్య నా దైవమా

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...