Friday, 9 March 2018

401. Na Sneham Yesuthone

నా స్నేహం యేసుతోనే
నా గమ్యం క్రీస్తులోనే
నా తల్లితండ్రులు నన్ను విడిచినా
యేసు నన్ను విడువడు..
నా హితులందరూ నన్ను మరిచినా
యేసు నన్ను మరువడు..      IIనా స్నేహంII

జగతికి రూపము లేనపుడు
నన్ను సృజియించెను
పిండముగా నేనున్నపుడు
నన్ను ఏర్పరచెను
చేయిపట్టి నడిపే దేవుడుండగా
భయమిక నన్ను చేరదుగా
తన కింపాపలా నన్ను కాయునూ
శ్రయమూ నన్నేమి చేయదు..    IIనా స్నేహంII

నా ప్రభు అరచేతిలో నేను
చెక్కబడి యుంటిని
తన కరముల నీడలో నిలిచి
స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగా
గొప్ప దుర్గమును స్థాపించెను
కాయము మొదలు జీవితాంతము
చంకనెత్తుకొను ప్రియ ప్రభువే     IIనా స్నేహంII

No comments:

Post a Comment

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...