Tuesday, 27 March 2018

438. Kanniti Kadalilo Kristhu Ni Padavalo Kadilindi Na Brathuku Yathra

కన్నీటి కడలిలో - క్రీస్తూ నీ పడవలో

కదిలింది నా బ్రతుకు యాత్ర - కరిగింది నా గత చరిత్ర

గతమెంచి నావారే పతితంచు బిలిచారే

భీతించి బాధించినారే వేదించి వెలివేసినారే

మితిమించిన ప్రేమ నేతెంచి రక్షించి

నీ చెంత నను జేర్చినావా నా చింతలే దీర్చినావా

దుష్టాత్మలే యేడు యిష్టాన నను గూడు

కష్టాల పాల్జేసెనాడు దృష్టించు నీవే నాతోడు

వీక్షించినావు రక్షించనీవు

దయ్యాల నదిలించినావు ఓ అయ్య నన్‌ నిల్పినావు

నీ సిల్వ మరణాన్ని నా పాప భరణాన్ని

కనులార నే గాంచినాను మనసారగా యేడ్చినాను

నీ వ్రేలు చరణాల నే వ్రాలి నీ మ్రోల

నీ ప్రేమ ధ్యానించినాను నా దేవ తరియించినాను

చిరుచీకటిలో నిన్ను దరిశించ కన్నీళ్ళ

మరుభూమి కరుదెంచినాను వెదుకాడి వేసారినాను

నినుగాన లేక నువు నాకు లేక

విలపించుచున్నాను దేవా ఓదార్చగా వేగరావా

గతిలేని నను జూచి అతిగా దయ తలచి

ప్రియమార పేరెత్తినావే కృపలూర కళ్ళొత్తినావే

నే దీనహీన మౌ మగ్దలీనా

నిను మోసికొని నేను పోనా నీ ప్రేమ చాటించలేనా

2 comments:

  1. నేను ఈ పాట మొదటి సారి సహోదరులు దైవ జనులు ch. ప్రేమసాగర్ గారు మాసిడోనియా సహవాసం మారేదిమిల్లి గ్రామం లో పరిచర్య చేసేవారు, ఆయన పాడడం విన్నాను. చాలా గొప్ప దైవజనులు, కొండ ప్రాంతాలలో సేవ చేసినారు.

    ReplyDelete
    Replies
    1. yes brother. i think ee pata rasindi kuda ayane anukunta. vijayawada loni ma church lo kuda ayana padaru ee pata.

      Delete

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.