à°¯ేà°¸ుà°¨ి à°•ొà°°à°•ై à°¯ిà°² à°œీà°µింà°šెà°¦
à°ాà°¸ుà°°à°®ుà°— à°¨ేననుà°¦ినము
à°¦ోà°·à°®ులన్à°¨ిà°¯ు à°¬ాà°ªెà°¨ు
à°®ోà°•్à°·à°¨ిà°µాసముà°¨ à°ª్à°°à°ు à°œేà°°్à°šుà°¨ుà°—ా
à°¨ాశనకరమగు à°—ుంà°Ÿà°²ో à°¨ుంà°¡ిà°¯ు
à°®ోసకరంà°¬ు à°¯ూà°¬ిà°¨ుంà°¡ి
à°¨ాà°¶à°šే à°¨ిà°² à°ªైà°•ెà°¤్à°¤ెà°¨ు నన్à°¨ు
à°ªిà°¶ాà°šి పధంà°¬ుà°¨ à°¦ొలగింà°šెà°¨్
పలుà°µిà°§à°®ుà°² à°ªాà°ªంà°¬ుà°¨ు à°œేà°¸ిà°¤ి
వలదని à°¦్à°°ోà°¸ిà°¤ి à°µాà°•్యముà°¨ు
à°•à°²ుà°·à°®ు à°¬ాà°ªెà°¨ు à°•à°°ుణను à°¬ిలచెà°¨ు
à°¸ిà°²ువలో నన్à°¨ాà°•à°°్à°·ింà°šెà°¨్
అలయక à°¸ొలయక à°¸ాà°—ిà°ªోà°¦ుà°¨ు
à°µెలయగ à°¨ా à°ª్à°°à°ు à°®ాà°°్à°—à°®ులన్
à°•à°²ిà°—ెà°¨ు à°¨ెà°®్మది à°•à°²ువరి à°—ిà°°ిà°²ో
à°µిà°²ువగు à°°à°•్తము à°šింà°¦ింà°šిà°¨ à°ª్à°°à°ు
à°¶ోà°§à°¨ à°¬ాà°§à°²ు à°¶్రమలిà°² à°•à°²్à°—ిà°¨
ఆదుà°•ొà°¨ుà°¨ు à°¨ా à°ª్à°°à°ువనిà°¶ం
à°µ్à°¯ాà°§ుà°²ు à°²ేà°®ుà°²ు మరణము వచ్à°šిà°¨
à°¨ాà°§ుà°¡ే à°¨ా à°¨ిà°°ీà°•్షణగుà°¨్
à°¬ుà°¦్à°§ి à°µిà°œ్à°žాà°¨ సర్వసంపదలు
à°—ుà°ª్తమైà°¯ుà°¨్నవి à°ª్à°°à°ుà°¨ంà°¦ు
à°…à°¦్à°ుతముà°— à°ª్à°°à°ువన్à°¨ిà°¯ు
à°¨ొసగి à°¦ిà°¦్à°¦ుà°¨ు à°¨ా à°¬్à°°à°¤ుà°•ంతటిà°¨ి
à°…à°°్à°ªింà°šెà°¨ు తన à°ª్à°°ాణము à°¨ాà°•ై
à°°à°•్à°·ింà°šెà°¨ు à°¨ా à°ª్à°°ిà°¯ à°ª్à°°à°ుà°µు
à°…à°°్à°ªింà°¤ుà°¨ు à°¨ా à°¯ావజ్à°œీవము
à°°à°•్à°·à°•ుà°¡ేà°¸ుà°¨ి à°¸ేà°µింà°ª
à°ª్à°°à°ుà°¨ంà°¦ాà°¨ంà°¦ింà°¤ుà°¨ు à°¨ిరతము
à°ª్à°°ాà°°్à°§à°¨ à°µిà°œ్à°žాపనములతో
à°µిà°ుà°¡ే à°¦ీà°°్à°šుà°¨ు à°¯ిà°² à°¨ా à°šింతలు
à°…à°à°¯à°®ుà°¤ో à°¸్à°¤ుà°¤ిà°¯ింà°¤ు à°ª్à°°à°ుà°¨్
à°¯ౌవన జనమా à°¯ిà°¦ిà°¯ే సమయము
à°¯ేà°¸ుà°¨ి à°šాà°Ÿà°¨ు à°°ాà°°ంà°¡ి
à°ªావన à°¨ామము పరిà°¶ుà°¦్à°§ à°¨ామము
à°œీవపు à°®ాà°°్à°—à°®ు à°ª్à°°à°šుà°°ింపన్
Thanks for uploading
ReplyDelete5à°µ à°šà°°à°£ం,4à°µ à°²ైà°¨్. à°¬్à°°à°¤ుà°•ంతటిà°¨ి à°…à°¨ుà°•ుంà°Ÿా..
ReplyDeletecorrected
DeletePlease upload 8th stanza too
ReplyDeletedone
Delete