Its a wonderful blog for telugu christian songs. Both Lyrics and Audio/Video available in this blog. you will definitely like this blog.
Index-Telugu
▼
Tuesday, 27 March 2018
427. Nadipinchuma Nitho Saha Payaninchuma Natho Sada
నడిపించుమా నీతో సహా
పయనించుమా నాతో సదా
ఇహనుండి పరలోక రాజ్యంబునకు
గాఢాంధకారములో పయనించగా
సుడిగాలి నాయందు ప్రసరించగా
నీవే వున్నావని నీవె నా దైవంబని
నీ వాక్యం నా బాటకు వెలుగిచ్చు దీపము
నే భయమొందను
లోకవ్యూహాన నా ఆత్మ సమసి
లోకమార్గాన నా దేహమలసి
లోక మాయా విశేషంబు పిలిచి నన్ను ఓడించగా
నా ప్రాణాశ వీడగ సమయాన
నా ప్రాణాలను బ్రతికించి కృపగాంచితి
ప్రేమా రుధిరంబుచే ప్రాణంబు బ్రతికించితే
నీ వాక్యం నా బాటకు వెలుగిచ్చు దీపము
నే భయమొందను
నేను యవ్వనమ్ము బలము ధరించి
నేను నా ధ్యాన న్యాయములో మురిసి
నేను నా కీర్తికై శ్రమలో సమసి నేలపై కూలితి
నా అంతరంగాన వ్యధ చెందినే
నను లేపి నడిపే సహాయంబుకై
నా చేతులు చాపగా నీ చేయి నను లేపగా
నీ వాక్యం నా బాటకు వెలుగిచ్చు దీపము
నే భయమొందను
This is my dad Dr John Reynolds song.
ReplyDelete