నిన్ను విడువను యేసుప్రభు
నిన్ను విడువగ లేను
ఎన్నడును నిను బాసి
ఏమిచేయగజాల నా ప్రభువా II నిన్నుII
నిను మరచి తిరుగుచు నేనుండిన
నీ సన్నిధి విడచి ఎటుబోయిన
నను మరువకను మరి విడువకను
వెనువెంట నుంటివి కాదా నా ప్రభువా! II నిన్నుII
అనుదిన జీవితమును మదినెంచగా
అనుకొనని అపాయము లెన్నెన్నియో
నను సంధించగా నను బంధించగా
నన్నాదుకొింవి గాదా నా ప్రభువా! II నిన్నుII
పలు సమయములందున నీ చిత్తమున్
పరిపూర్ణముగా నే నెరుంగక
మేలని తలచి కీడునె యడుగ
వలదంచు నిలిపితి వాహా నా ప్రభువా! II నిన్నుII
నీ మేలుల నన్నిటి నే నెంచగా
నీ ప్రేమామృతమును చవి చూడగా
నా మది భక్తితో నా హృది ప్రేమతో
ఉప్పొంగి పొరలెను గాదా నా ప్రభువా! II నిన్నుII
Very nice song praise the lord
ReplyDelete