Saturday, 6 August 2016

164. Devuni Prema Idigo Janulara Bhavambunandeliyare

దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును        

సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను        

మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే        

యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు        

పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను        

సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను        

చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి        

గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను        

చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్        

ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు        

ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను        

రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను        

రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాధు లందరు జూడగా        

మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్        

పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను        

నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను        

        

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...