Saturday, 6 August 2016

165. Nannenthagano Prmeinchenu Nannenthagano Karuninchenu

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)           ||నన్నెంత||

సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)   ||నన్నెంత||

సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)              ||నన్నెంత||

కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2)      ||నన్నెంత||

ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.