Saturday, 20 August 2016

213. Yesayya Nitho Unte Nakentho Aanadamu

యేసయ్యా నీతో ఉంటే నాకెంతో ఆనందము
నీ సన్నిధిలో నేనుండుటే నాకెంతో సంతోషము
నీ ప్రేమను చాటెదన్. నీ కృపను ఘనపరచెదన్
స్తుతికి పాత్రుడ స్తోత్రార్హుడ విజయము నీకే

నా దుఃఖ సమయములో ఓదార్పు నిచ్చితివి
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
ఓ దేవా నా ప్రభువా నన్ను ప్రేమించినావే

అగాధజలములో నేనుండగా నీ కృపతో లేపితివి
నీ దక్షిణ హస్తమును నాపై ఉంచితివి
నా విమోచకా ప్రాణేశ్వరా నన్ను కాపాడినావు

1 comment:

స్థిరపరచువాడవు | ఏమైనా చేయగలవు | Telugu Christian Song #594

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొ...