ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ||ప్రభువా||
కోరి వెదికావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలనన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను తలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతిలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా||
నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషిగ ఇల నీవు నిలిపావులే (2) ||ప్రభువా||
బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – మరి పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||
నా బాధలో నీవు నిలిచావయ్యా
నీ వాడుగా నన్ను చేశావయ్యా (2)
నన్ను పిలిచావయ్యా చేయి చాపావయ్యా (2)
నీ కృపలో నన్ను కాపాడయ్యా (2) ||ప్రభువా||
Bro ee song audio kavali broy
ReplyDeleteGood song.. upload more songs
ReplyDelete. Audio also
God bless you
ReplyDelete