Index-Telugu

Monday, 8 August 2016

176. Prema Nammakamu gala Paraloka Thandri

ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను
రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను

త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను
మనలను తానె నిర్మించెగనుక మనలను ప్రేమించెను

శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను
తన రక్తములో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా

తండ్రివలెనే ప్రేమజూచి నీచులనెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును

ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే

4 comments: